AP టు TS నెంబర్ మార్చాల్సిందే?: అంతా ఆన్‌లైన్‌లోనే, దేనికెంత?

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వాహనాలు AP రిజిస్ట్రేషన్‌తో రోడ్లపై సంచరించేవి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాహనదారులు తమ వాహనాల నెంబర్లను తెలంగాణ (TS) పేరుతో మార్చుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆ దిశగా అధికారులు ప్రక్రియను మొదలు పెట్టలేదు.

అయితే తాజాగా తెలంగాణ పరిధిలో ఏపీ సిరీస్‌తో ఉన్న దాదాపు 74 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్‌ను మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

ఇందుకోసం వాహనదారులు ఆన్‌లైన్‌లో సులువుగా మార్చుకునేలా కొత్త సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. తద్వారా వాహనదారులే నేరుగా ఆన్‌లైన్‌లో రాష్ట్ర, జిల్లా కోడ్‌లను సులువుగా మార్చుకోవచ్చు. ఈ కొత్త విధానంలో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ పాతదే ఉంటుంది. కేవలం రాష్ట్ర కోడ్, జిల్లా కోడ్‌లు మాత్రమే మారనున్నాయి.

 How to transfer vehicle registration from andhra pradesh to telangana

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రవాణాశాఖ జిల్లాలకు కొత్త కోడ్‌లను కేటాయించింది. దీనికి అనుగుణంగా ఏపీ రిజిస్ట్రేషన్ సిరీస్ వాహనదారులు ఆన్‌లైన్‌లో మార్పు చేసుకుని కొత్త నంబర్ ప్లేట్ తీసుకోవాలి. ఆ తర్వాత కొత్త నంబర్ సిరీస్‌కు సంబంధించి ఆర్‌సీ‌ని వాహనదారుడి ఇంటికి పంపుతారు.

ఈ మొత్తం నెంబర్ రిజిస్ట్రేషన్ మార్పుకు సంబంధించిన ఖర్చును వాహనదారుడే భరించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్పుచేర్పుల ప్రక్రియకు రూ. 100 వరకు సర్వీసు చార్జీతోపాటు కొత్త ఆర్‌సీ కార్డు తయారీకి అయ్యే చార్జీని కూడా వాహనదారుడే చెల్లించాలి.

ఏపీ నుంచి తెలంగాణకు నెంబర్‌ను మార్చుకున్నందుకు గాను ద్విచక్ర వాహనదారులకు దాదాపు రూ. 450 వరకు, కార్లకు రూ. 650 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్‌తో తప్పనిసరిగా హై సెక్యూరిటీ ప్లేటు బిగించుకోవాలని తెలంగాణ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో విధివిధానాలు జారీ కానున్నాయి. TS రిజిస్ట్రేషన్ సిరీస్ అమల్లోకి రాకముందు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్ సిరీస్‌ను ఏపీ నుంచి టీఎస్‌లోకి మార్చేందుకు గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా దానికి సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలపై స్పష్టత ఇవ్వకపోవటంతో ఆ ప్రక్రియ మొదలవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+