పోలీసుల కనుసన్నల్లో భ్యాంకులు

హైదరాబాద్ : రద్దు చే'సిన పెద్ద నగదు నోట్ల మార్పిడి కోసం పెద్ద ఎత్తున ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులుతీరారు. బ్యాంకుల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు.ఒక్క రోజు సెలవు తర్వాత బ్యాంకులు తెరవడంతో బ్యాంకుల వద్ద ఉదయం నుండే జనం పడిగాపులు కాస్తున్నారు.

huge crowed at banks for exchange of banned currency

నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదు నోట్లను రద్దు చేసింది. ఈ నోట్లను మార్పిడి చేసుకొనేందుకు ఈ ఏడాది డిసెంబర్ వరకు కేంద్రం అనుమతి ఇచ్చింది.ఒక్క రోజు సెలవు తర్వాత బ్యాంకులు గురువారం నాడు తెరుచుకోవడంతో ఖాతాదారులు రద్దు చేసిన నగదును మార్పిడి చేసుకొనేందుకు ఉదయం నుండే బ్యాంకుల వద్ద క్యూ కట్టారు.

huge crowed at banks for exchange of banned currency

ఖాతాదారులు తమ గుర్తింపు కార్డును చూపితేనే బ్యాంకులు ఒక ధరఖాస్తు పారాన్ని ఇస్తారు. ఈ ఫారం నింపి తమ వద్ద ఉన్న రద్దు చేసిన పెద్ద నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రద్దు చేసిన గదు నోట్లను వదిలించుకోవడానికి ప్రజలు కష్టాలుపడుతున్నారు. బుదవారం ఒక్క రోజే చిన్న నగదు నోట్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోజు వారీ ఖర్చుల కోసం నిత్యావసర సరుకుల కోనుగోలు కోసం కష్టాలు పడ్డారు.

huge crowed at banks for exchange of banned currency

పెద్ద నగదు నోట్ల మార్పిడి కోసం బ్యాంకు పనిచేసే వేళ కంటే ముందుగానే ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకొన్నారు.ఆఫీసు వేళల కంటే ముందుగానే రద్దు చేసిన నగదు నోట్లను మార్పిడి చేసుకొనేందుకు బారులు తీరారు. గృహిణులు, ముదుసలివారు , విధ్యార్థులు కూడ ఈ క్యూ లెైన్లలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుల వద్దకు రావడంతో సిబ్బందిపై భారం పడింది.

పోలీసుల భద్రత.


బ్యాంకుల వద్ద ఖాతాదారులు నగదు మార్పిడి కోసం వస్తారని భావించిన పోలీసులు ప్రతి బ్యాంకు వద్ద భద్రతను ఏుర్పాటు చేసింది. బ్యాంకుల వద్ద పోలీసులు బారులు తీరడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు కాకుండా చూస్తున్నారు.మరో వైపు ఇబ్బంది పెద్ద ఎత్తున నగదు మార్పిడి కోసం జనం వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మఫ్టీల్లో కూడ పోలీసులు పరిసరాలను పరిశీలిస్తున్నారు.

huge crowed at banks for exchange of banned currency

రద్దు చేసిన రద్దు చేిసన నగదు నోట్లతో ఖాతాదారులు వచ్చే అవకాశం ఉన్నందున దొంగలు కూడ చౌర్యానికి పాల్పడే అవకాశం ఉన్నందున పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ప్రతి బ్యాంకు వద్ద సుమారు ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్ళను ఏర్పాటు చేశారు. బ్యాంకుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+