వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ టైర్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ టైర్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరిపీల్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మూడు ఫైరింజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. టైర్ రీబటన్ కంపెనీ సహా భారీ ఎత్తున టైర్లు మంటల్లో దగ్ఘమయ్యాయి.

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై సమాచారం తెలియాల్సి ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగనట్లు సమాచారం.
కాగా, ఇటీవల సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేటలో ఓ ఐదు అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి అంతస్తులో మొదలైన మంటలు ఐదంతస్తులకు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇటీవలే ఆ భవనాన్ని కూల్చి వేశారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications