తెలంగాణలో గ్రీన్ ఫార్మా కంపెనీల భారీ పెట్టుబడులు: వేలాది ఉద్యోగాలు

కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సచివాలయంలో వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంప్రదింపులు అనంతరం ఎంవోయూలపై ప్రతినిధులు, అధికారులు సంతకాలు చేశారు.

ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీలతో ఎంవోయూలు జరిగాయి. ఈ ఆరు కంపెనీలు దాదాపు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ కంపెనీల విస్తరణ కార్యకలాపాల వల్ల ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించనుంది.

Huge investments by green pharma companies in Telangana Thousands of jobs

ఎంవోయూల ప్రకారం.. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. లారస్ ల్యాబ్స్, అరబిందోలు ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ ఫార్మా ఆర్ అండ్ డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్‌స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఇంజెక్టబుల్స్‌, బయో సిమిలర్స్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటిరో గ్రూప్ ఫినిషిడ్ డోస్, ఇంజెక్టబుల్స్‌ తయారీ పరిశ్రమ నెలకొల్పుతుంది.

మరో నాలుగు నెలల్లో ఈ ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అవగాహన ఒప్పందాల సందర్భంగా టీజీఐఐసీ (TGIIC) చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమలు (పెట్టుబడులు) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

కంపెనీల తరఫున డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ డైరెక్టర్ సతీష్​ రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వివి రవికుమార్, గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ఎన్‌ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్ఎన్​ రెడ్డి, అరబిందో డైరెక్టర్ మదన్​మోహన్​ రెడ్డి, హెటిరో గ్రూప్ ఎండీ బి.వంశీకృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+