షర్మిలకు బిగ్ రిలీఫ్ - ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ : మార్చి 1 నుంచి మొదలు..!!
వైఎస్సార్టీపీ అధినేత్రి కు భారీ రిలీఫ్ దొరికింది. రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన షర్మిలకు పార్టీ పేరు మీద కొద్ది రోజులుగా వివాదం నెలకొని ఉంది. 2021 ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో కార్యకర్తలతో సమావేశం పెట్టి పార్టీ పెడుతున్నానని చెప్పిన ఆమే అప్పటికే ఎన్నికల సంఘం రిజిష్ట్రేషన్ కోసం దరఖస్తు చేశారు. జులై 9న అధికారికంగా సభ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణ చేసి జెండా, అజేండా ప్రకటించారు. షర్మిల పార్టీ పెరు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆమే పార్టీని గుర్తించవద్దని, అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ భాషా ఢిల్లి కోర్టులో ఫీర్యాదు చేశారు.
Recommended Video

పార్టీ గుర్తుపైన డైలమా
మరోవైపు ఎన్నికల సంఘానికి కుడా పార్టీకి గుర్తింపునివ్వడంపై తమకు అభ్యంతారాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పేరు మీద మరో పార్టీ వస్తే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని అయన ఈసీకి వివరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈసీ షర్మిల పార్టీ గుర్తింపు గురించి పెద్దగా ముందడుగు వేయడం లేదు. ప్రతి నెల కొన్ని ప్రశ్నలతో లెటర్లు మాత్రం రాస్తూ పార్టీ గుర్తింపు ప్రక్రియను పుర్తి చేయలేదు. దీంతో..షర్మిలకు తన తండ్రి పేరుతో పార్టీ కొనసాగిస్తారా లేదా అనే సందేహం వ్యక్తం అయింది.

విజయమ్మ లేఖ ఇచ్చినా
వైఎస్సార్ పేరుతో ఏపీలో వైఎస్సార్సీపీ ఉండటంతో..ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సైతం తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవంటూ లేఖలు రాసారు. అయినా.. ఎన్నికల సంఘం నుంచి వైఎస్సార్టీపికి క్లియరెన్స్ రాలేదు. దీని పైన షర్మిల ప్రతినిధులు నిరంతరం ఎన్నికల సంఘంతో సంప్రదింపులు చేయటంతో..తాజాగా ఈసీ నుంచి వైఎస్సార్టీపీకి లేఖ అందింది. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో..ఇప్పటి వరకు పార్టీ పేరు పైన కొనసాగిన డైలమా క్లియర్ అయింది.

ఎన్నికల సంఘం గుర్తింపు
ఇక, తెలంగాణ లో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నల్గొండ జిల్లాలో యాత్ర కొనసాగుతున్న సమయంలో నిలిపివేసారు. కోడ్ ఎత్తివేసిన వెంటనే పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. కానీ, ఇంకా ప్రారంభించ లేదు. మొత్తం నాలుగు వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసే విధంగా కార్యాచరణ సిద్దం చేసారు. ఇక, తిరిగి మార్చి ఒకటో తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించాలని భావిస్తున్నారు. మార్చి 1వ తేదీ నుంచి పాదయాత్ర ను నల్గొండ జిల్లా నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications