వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవహక్కుల దినం.!స్వేఛ్యను హరించే అధికారం ఎవ్వరికీ లేదు.!అది ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తే తప్ప.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భూమ్మీద పడిన ప్రతి జీవికి అది జీవనాన్ని గడిపే క్రమంలో కొన్ని హక్కులు, స్వేఛ్చ, స్వతంత్ర్యత సంతరించుకున్నట్టే, పరిమితులు కూడా ఉంటాయి. అవి వాటి పుట్టుకతోనే ఆ హక్కు సంతరించుకుంటుంది. ప్రాచీన కాలంలో ఈ స్వేఛ్చ కోసమే అనేక యుద్దాలు, పోరాటాలు, ఆంక్షలు, సరిహద్దులు రూపుదిద్దుకున్నట్టు చరిత్ర చెప్తోంది. ఇక ఆధునికి కాలంలో రాజ్యంగంలోని ప్రాథమిక సూత్రాలకు లోబడి ఈ స్వేఛ్చను అనుభవించాల్సిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మానవ జీవితంలో స్వేఛ్చ అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో దాని పరిమితులు కూడా అంతే పటిష్టంగా పరిణమించాయి.

 ప్రతి ప్రాణికీ కొన్ని హక్కులు ఉంటాయి.. అది జన్మతః సంతరించుకున్న హక్కు

ప్రతి ప్రాణికీ కొన్ని హక్కులు ఉంటాయి.. అది జన్మతః సంతరించుకున్న హక్కు

సమాజంలో స్వేఛ్చకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పదిగా అభివర్ణిస్తారు. మనిషితో పాటు అన్ని ప్రాణులకు వాటి పరిమితులను బట్టి స్వేఛ్చను అనుభవిస్తుంటాయి. ఈ స్వేచ్చ హద్దులు మీరినప్పుడే అనేక సమస్యలు, ఉత్పాతాలు, ఒక్కోసారి రక్తపాతం చోటుచేసుకుంటుంది. పూర్వపు రోజుల్లో రాజ్యాల కోసం యుద్దాలు జరిగేవి అది కేవలం స్వేఛ్చను లాక్కోవడం కోసం, స్వతంత్ర్యతను ఆక్రమించుకోవడం కోసమే భీకర పోరాటాలు జరిగేవి. తర్వాత కాలక్రమంలో స్వేఛ్చ, స్వతంత్ర్యం, హక్కులు వాటి పరిమితులు అనే అంశాలపై నిర్ధిష్టమైన చట్టాలు రూపొందించబడ్డాయి.

 స్వేఛ్చ మీద దాడులే యుద్దాలుగా మారాయి.. మారణహోమం జరిగింది కూడా ఇందుకే..

స్వేఛ్చ మీద దాడులే యుద్దాలుగా మారాయి.. మారణహోమం జరిగింది కూడా ఇందుకే..

ఒకప్పుడు ఇవే హక్కులకోసం ఘర్షణ పూరిత వాతారణంలో నుంచి క్రమంగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునికత సంతరించుకున్న నేటి సమాజంలో హక్కులను గౌరవించుకునే వరకూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ హక్కుల పరిరక్షణకోసం అనేక చట్టాలను రూపొందించడమే కాకుండా మానవ హక్కుల దినాన్ని నిర్వహించుకోవాలని కూడా పొందుపరిచారు. దీంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖుని అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా జరుపుకుంటారు. ఐనప్పటికి మానవ హక్కులు వాటి పరిమితుల గురించి చాలా మందికి తెలియదు.

 హక్కును హరించం నేరం.. ప్రాధమిక సూత్రాలకు లోబడే వ్యవహరించాలి

హక్కును హరించం నేరం.. ప్రాధమిక సూత్రాలకు లోబడే వ్యవహరించాలి

1948 సంవత్సరం, డిసెంబర్ 10వ తారీఖున ఐక్యరాజ్యసమితి తొలిసారిగా ప్రపంచ మానవ హక్కుల ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి ప్రపంచమంతా డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించుకుంటుంది. భారత దేశంలో కూడా ఇదే రోజును మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1948వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పేరుతో డిక్లరేషన్ ను విడుదల చేసింది. ఇది ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించే ఒక అధికార పత్రంగా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ప్రపంచంలో అత్యధిక భాషల్లోకి అనువదించారు. దాదాపు 400 భాషల్లోకి ఈ ప్రతిపాదను అనువదించారు.

 సమాజంలో అందరికీ సమాన హక్కులు.. ఉల్లంఘిస్తే శిక్షలు తప్పువు

సమాజంలో అందరికీ సమాన హక్కులు.. ఉల్లంఘిస్తే శిక్షలు తప్పువు

యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం మానవ హక్కులను ఈ విధంగా రూపొందించారు. ఆర్టికల్ 1 ప్రకారం ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే స్వేచ్ఛా, సమానత్వం లభిస్తాయి. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ సమానమైన గౌరవం హక్కులు ఉంటాయి. ఆర్టికల్ 2 ప్రకారం మనుషులు అందరూ సమానమే, వారి హోదా, సంపద, కుటుంబ నేపథ్యం ఇలా దేనికారణంగా కూడా వివక్ష చూపడానికి వీల్లేదు. ఆర్టికల్ 3 ప్రకారం ప్రతి మనిషికి ఆ దేశ రాజ్యాంగానికి లోబడి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 4 ప్రకారం మనిషి ఎవ్వరికీ బానిసలు కాదు, సమాజంలో ఎవరైనా బానిసలుగా భావిస్తే వారిని ఎదిరించి చట్టపరంగా ఎవరి హక్కులను వారు పరిరక్షించుకోవచ్చు. రాజ్యాంగంలోని ప్రాధమిక సూత్రాలు కూడా ఇవే అంశాలను నిర్ధారిస్తున్నాయి.

English summary
Every living thing on earth has certain rights, liberties and freedoms in order for it to live, but it also has limitations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X