కాంగ్రెస్ లో పెద్ద లొల్లి..! పెద్ద‌ప‌ల్లి లోక్ స‌భ టికెట్ కోసం గాంధీ భ‌వ‌న్ ముందు దీక్ష‌..!!

హైద‌రాబాద్ : కాంగ్రెస్ అదిష్టానం ఎంపీ సీటు కేటాయిస్తే గెలిచి చూపిస్తామ‌ని కొంద‌రు నేత‌లు అంటుంటే, సీటు త‌మ‌కే కేటాయించాల‌ని ఊట్ల వ‌ర‌ప్ర‌సాద్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం గ‌తంలో ఆయ‌న మ‌రి కొంత మంది నేత‌లతో క‌లిసి మోకాళ్ల ప్ర‌ద‌క్షిణ‌లు కూడా చేసారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్య‌ర్తిత్వం కోసం ఇంత పోటీ నెల‌కొందా అని ఆశ్య‌ర్య‌పోతున్నారు సొంత పార్టీ నేత‌ల‌తో పాటు కొంత మంది ఇత‌ర పార్టీ నేత‌లు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద‌ప‌ల్లి లోక్ స‌భ టికెట్ గురించి పెద్ద పంచాయ‌తీ జ‌రుగుతోంది. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎం.పీ అభ్యర్థిగా స్థానికేతరుడు అయిన ఆగం చంద్రశేఖర్ ను ప్రకటించడాన్ని నిరసిస్తూ, ఆగం అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, పెద్దపల్లి పార్లమెంటు స్థానిక నాయకుడు ఊట్ల వరప్రసాద్ గాంధీభవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.

ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ " మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ ఓటమికి ముఖ్య కారణమై, పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయిన వ్యక్తి కి ఎలా సీటు కేటాయిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతే కాకుండా పార్టీని తప్పు దోవ పట్టించి సస్పెన్షన్ ను ఎత్తివేయించి పెద్దపల్లి ఎం.పీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు వ‌ర ప్ర‌సాద్.

hunger strike for ticket in front of Gandhi Bhavan.!!

పెద్దపల్లి పార్లమెంట్ స్థానిక నాయకుడిగా త‌న‌కు అవకాశం కల్పించాలని, సానుకూల నిర్ణయం అధిష్టానం నుండి వచ్చే వరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి తీరుతానని తేల్చి చెప్పుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్, యంగ్ బ్రిగేడ్ జిల్లా అధ్యక్షులు చిలుక రాంమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+