ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు, అనుమానంతో అతను ఏం చేశాడంటే

హైదరాబాద్ :అనుమానం పెనుభూతమైంది.ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు, మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటుందని అనుమానించాడు. మాట్లాడాలని పిలిచి ఆమె గొంతుకోశాడు. స్థానికులు అతణ్ణి చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన హైద్రాబాద్ కొత్తపేటలో చోటుచేసుకొంది.

సంగారెడ్డి జిల్లా బుదేరా గ్రామానికి చెందిన గడ్డం రమేష్ సంగారెడ్డిలో బికాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మెదక్ జిల్లా కోహిర్ గ్రామానికి చెందిన మమత ను ప్రేమించాడు. వీరిద్దరూ పెద్దలను ఎదిరించి ఈ ఏడాది జనవరి 10వ, తేదిన వివాహం చేసుకొన్నారు. ఈ వివాహం మమత కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. దీంతో మమతను ఆమె కుటుంబసభ్యులు తమ వెంట తీసుకొచ్చారు.

husband attempted stabbing on his wife


అనుమానం తో హత్యకు పథకం

ప్రేమ వివాహం ఇష్టం లేని మమత కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్ లో నర్సింగ్ కోర్సులో చేర్పించారు. ఈ ఏడాది జూన్ మాసంలో కొత్తపేటలోని గౌతమి నర్సింగ్ హస్టల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె నర్సింగ్ కోర్స్ చేస్తోంది. అయితే ఆమె హైద్రాబాద్ లో ఉన్న విషయం తెలుసుకొన్న రమేష్ అప్పుడప్పుడూ ఆమె వద్దకు వచ్చి వెళ్ళేవాడు. ఇటీవల కాలంలో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని అతను అనుమానించాడు.

ప్రేమించి పెళ్ళిచేసుకొన్నా తల్లిదండ్రులకు ఇష్టం లేని కారణంగా తమను దూరం చేశారని రమేష్ భావించాడు.అంతేకాదు మమత ప్రవర్తనలో మార్పు రావడంతో ఆయన రగిలిపోయాడు. మరో యువకుడితో ఆమె సన్నిహితుంగా ఉంటుందని అనుమానించాడు. తనను దూరంగా ఉంచుతోందని అనుమానం పెంచుకొన్నాడు. రమేష్.మరో యువకుడితో సన్నిహితంగా ఉంటున్నావని ఆమెను రమేష్ వేధించేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.దీంతో ఆమెను హత్యచేయాలని భావించాడు

శనివారం నాడు రమేష్ హైద్రాబాద్ కు వచ్చాడు. ఆమె ఉంటున్న హస్టల్ వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడాలని విఎం గ్రౌండ్ వరకు తీసుకెళ్ళాడు. అక్కడే ఆమెతో సుమారు గంటసేపు మాట్లాడాడు.ఇద్దరి మధ్య ఏం జరిగిందో కాని, రమేష్ తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో ఆమె కేకలు వేసింది. ఈ ఘటనతో గ్రౌండ్ లో వాకింగ్ చేస్తోన్న వారు రమేష్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. మమతను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+