ప్రియుడితో హోటల్లో భార్య: నిఘా పెట్టి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!

Subscribe to Oneindia Telugu

వనపర్తి: భర్త కళ్లు గప్పి ప్రియుడితో కొంతకాలంగా సంబంధం నెరుపుతున్న ఓ మహిళా అధికారిణి వ్యవహారం తాజాగా బయటపడింది. ప్రియుడితో భార్య హోటల్లో గడుపుతున్న సమయంలో భర్త రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లాకు చెందిన లేబర్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న కామారెడ్డికి చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భార్య లక్ష్మీప్రసన్న ప్రవర్తనలో మార్పు గమనించిన మహేష్ ఆమె కదలికలపై నిఘా పెట్టాడు.

Husband caught his wife red handed with labour officer

ఈ నేపథ్యంలో ఇటీవల వనపర్తిలోని నందిహిల్స్ హోటల్లో తన భార్య ప్రియుడితో కలిసి ఉందన్న సమాచారం మహేష్ కు అందింది. దీంతో స్వయంగా అతనే రంగంలోకి దిగి హోటల్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరు ఒకే గదిలో ఉండటంతో వీరి వ్యవహారం బట్టబయలైంది. ప్రియుడి గోపిరెడ్డి కామారెడ్డికి చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా నిర్దారించారు. దీనిపై మహేష్ కేసు నమోదు చేసింది లేనిది తెలియరాలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A wife was caughted red handedly by her husband while she was spending with her boy friend in a hotel, Vanaparthy.
Please Wait while comments are loading...