వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, గర్భం దాల్చా.. ఆయనతోనే ఉంటా: ప్రియురాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల: అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలోని చెక్కలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సత్యనారాయణ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్యకు భర్తపై అనుమానం వచ్చింది.

బాబాయ్ వరుస అయ్యే వ్యక్తితో ప్రేమ, పెళ్లి: హత్య చేసిన తండ్రిబాబాయ్ వరుస అయ్యే వ్యక్తితో ప్రేమ, పెళ్లి: హత్య చేసిన తండ్రి

అతని వ్యవహారంపై విచారించిన భార్య పద్మ.. తన భర్త సంధ్య అనే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని నిర్ధారణకు వచ్చింది. ఇద్దరు కలిసి ఉన్న సమయం చూసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త ఎక్కువగా ఇంటికి రాకపోవడం, ఇంట్లో డబ్బు, నగదు తరుచూ మాయం అవుతుండటంతో భార్యకు అనుమానం వచ్చింది.

భర్త కదలికలపై ఆరా

భర్త కదలికలపై ఆరా

భర్త కదలికలపై ఆరా తీసింది. వెంకంపేటలో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకొని, ఇద్దరు కలిసి ఉన్న సమయంలో బంధువులను తీసుకొని వెళ్లి భర్తను, ప్రియురాలిని చితకబాదింది. మరో మహిళతో రహస్య కాపురం పెట్టడంపై భార్య ఆగ్రహోద్రురాలైంది.

పట్టించుకోవడం లేదని ఆవేదన

పట్టించుకోవడం లేదని ఆవేదన

తన భర్త, ప్రియురాలి కలిసి ఉండటంతో వారిని చితక్కొట్టిన ఆ భార్య ఆ తర్వాత ఆ ఇంట్లోని వస్తువులను బంధువులతో కలిసి ధ్వంసం చేసింది. దాదాపు పది రోజులుగా తన భర్త ఇంటికి రావడం లేదని భార్య వాపోయింది. తన భర్త ప్రియురాలికి భర్త, పిల్లలు ఉన్నప్పటికీ వారిని విడిచి తన భర్తను లోబర్చుకుందని ఆరోపించింది. గత కొద్ది రోజులుగా తన భర్త తనను, పిల్లల్ని పట్టించుకోవడం లేదని చెప్పింది. అందుకే ఈ రోజు బంధువులతో కలిసి వచ్చామని తెలిపింది. తన భర్త ఆమెకు పెద్ద మొత్తం ఇచ్చారని ఆరోపించింది.

వారిపై కేసు పెడతా

వారిపై కేసు పెడతా

దీనిపై ప్రియురాలు సంధ్య కూడా స్పందించింది. తమ మధ్య ఉన్న వ్యవహారం గురించి ఆమెకు ఎప్పుడో తెలుసునని, ఆమె కావాలనే రాద్ధాంతం చేస్తోందని ఆరోపించింది. అతనితో తనకు పెళ్లయిందని చెప్పింది. గర్భంతో ఉన్న తనను, తన తల్లిని కొట్టారని ఆరోపించింది. తనపై దాడి చేసినందుకు వారిపై కేసు పెడతానని చెప్పింది. తాను గర్భం దాల్చానని అతనితోనే ఉంటానని చెప్పింది.

పోలీస్ స్టేషన్ తరలింపు

పోలీస్ స్టేషన్ తరలింపు

విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సదరు స్కూల్ అసిస్టెంట్‌ను, ప్రియురాలిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారితో పాటు ఇరువర్గాలను కూడా పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు.

English summary
Husband Illegal Affair Caught By Wife in Sirciall District on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X