షాక్:పెద్దలను ఎదిరించి సుధాకర్ రెడ్డితో పెళ్ళి, స్వాతికి కర్మకాండలు,

నాగర్‌కర్నూల్: సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య ఉదంతం వెలుగు చూడడానికి ఆయన స్నేహితుడికి వచ్చిన అనుమానం ప్రధాన కారణంగా మారింది. సుధాకర్ రెడ్డి భార్య స్వాతి మరో వ్యక్తితో కలిసి తిరగడాన్ని చూసిన సుధాకర్ రెడ్డి స్నేహితుడు తన అనుమానాన్ని పోలీసులు, కుటుంబ సభ్యుల వద్ద వ్యక్తం చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

అయితే సుధాకర్ రెడ్డిని స్వాతి ప్రేమించి పెళ్ళి చేసుకొంది. పెద్దలను ఎదిరించి మరీ స్వాతి సుధాకర్ రెడ్డిని వివాహం చేసుకొంది. ఇదిలా ఉంటే స్వాతికి ఆమె కుటుంబసభ్యులు కర్మకాండలు నిర్వహించారు. బతికుండగానే స్వాతికి కర్మకాండలు నిర్వహించడం సంచలనంగా మారింది

నవంబర్ 26వ,తేది రాత్రి జరిగిన కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగ చూశాయి. ప్రియుడు రాజేష్‌తో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా స్వాతి.. ప్రేమించి పెళ్ళి చేసుకొన్న సుధాకర్ రెడ్డిని హత్య చేసింది.

సుధాకర్ రెడ్డిని హత్య చేసి, ఆ స్థానంలో రాజేష్‌ను తీసుకొచ్చేందుకు స్వాతి పన్నిన కుట్రను ఎట్టకేలకు పోలీసులు సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. సుధాకర్ రెడ్డిని హత్య చేసిన రాజేష్, స్వాతిలు ప్రస్తుతం జైలు ఊచలను లెక్కిస్తున్నారు.

పెద్దలను ఎదిరించి సుధాకర్ రెడ్డితో స్వాతి వివాహం

పెద్దలను ఎదిరించి సుధాకర్ రెడ్డితో స్వాతి వివాహం

సుధాకర్ రెడ్డిని స్వాతి ప్రేమించి వివాహం చేసుకొంది. సుధాకర్ రెడ్డితో వివాహనికి స్వాతి కుటుంబసభ్యులు తొలుత ఒప్పుకోలేదు. అయితే పెద్దలను ఎదరించి పట్టుబట్టి స్వాతి సుధాకర్ రెడ్డిని వివాహం చేసుకొంది. సుధాకర్ రెడ్డిని పెధ్దలను ఎదిరించి వివాహం చేసుకొన్న స్వాతి.. ఏడేళ్ళ తర్వాత ఎందుకు ఆయనను హత్య చేసిందో అర్ధం కాలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు

సుధాకర్ రెడ్డి స్నేహితుడి అనుమానం

సుధాకర్ రెడ్డి స్నేహితుడి అనుమానం


నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డికి ఆయన ప్రవర్తనపై స్నేహితుడు ఇచ్చిన సమాచారమే కీలకంగా మారింది. సుధాకర్ రెడ్డి స్నేహితుడు నవంబర్ 25వ, తేదిన సుధాకర్ రెడ్డి వాహనాన్ని మహబూబ్‌నగర్‌లో చూశారు. ఆ వాహనంలో సుధాకర్ రెడ్డి సతీమణి కూడ ఉంది. అయితే సుధాకర్ రెడ్డిని మహబూబ్ నగర్‌కు వచ్చావా అంటూ సుధాకర్ రెడ్డి స్నేహితుడు ఫోన్ చేశాడు. అయితే తాను రాలేదని చెప్పాడు. అయితే నీ వాహనాన్ని మహబూబ్ నగర్‌లో చూశానని స్నేహితుడు చెప్పడంతో భార్యను సుధాకర్ రెడ్డి నిలదీశాడు. దీంతో స్వాతికి రాజేష్‌తో వివాహేతర సంబంధం ఉన్న విషయం బట్టబయలైంది.

రాజేష్ తీరుపై అనుమానం

రాజేష్ తీరుపై అనుమానం

యాసిడ్ దాడికి గురైన సుధాకర్ రెడ్డిని హైద్రాబాద్ ఆసుపత్రిలో పరామర్శించేందుకు ఆయన స్నేహితుడు వచ్చాడు. అయితే సుధాకర్ రెడ్డి పేరుతో రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే సుధాకర్ రెడ్డి కాదని అతని స్నేహితుడు గుర్తుపట్టాడు. అయితే తన అనుమానాన్ని సుధాకర్ రెడ్డి కుటుంబసభ్యులతో పంచుకొన్నారు. అయితే అదే సమయంలో సుధాకర్ రెడ్డి తల్లి కూడ సందేహలు ఉండడంతో ఎట్టకేలకు ఆ అనుమానాలు కూడ తీరాయి. దీంతో సాక్ష్యాధారాలతో పోలీసులు స్వాతి, రాజేష్‌ను అరెస్ట్ చేశారు.

స్వాతికి కర్మకాండలు నిర్వహించిన తల్లిదండ్రులు

స్వాతికి కర్మకాండలు నిర్వహించిన తల్లిదండ్రులు


సుధాకర్ రెడ్డిని రాజేష్‌తో కలిసి స్వాతి హత్య చేసిందనే విషయం తెలుసుకొన్న తర్వాత స్వాతి తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సుధాకర్ రెడ్డిగా భావించి ఆసుపత్రి బిల్లు కూడ చెల్లించారు.అయితే రాజేష్‌ అని తెలియడంతో స్వాతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సుధాకర్ రెడ్డిని స్వాతి హత్య చేసిందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. స్వాతికి కర్మకాండలు నిర్వహించారు. తన కూతురు చనిపోయిందని తండ్రి లింగారెడ్డి చెబుతున్నారు. భవిష్యత్తులో తన ఇంటికి స్వాతి రానివ్వమని చెబుతున్నారు.

బంధవుల అమ్మాయితో ఫిజియోథెరపీ సెంటర్‌

బంధవుల అమ్మాయితో ఫిజియోథెరపీ సెంటర్‌


స్వాతికి నడుము నొప్పి నయం కావడం కోసం ఫిజియోథెరపీ సెంటర్‌కు వెళ్ళేది. ప్రతి రోజూ సాయంత్రం బంధువుల అమ్మాయితో కలిసి పిజియోథెరపీ సెంటర్‌కు వెళ్ళేది. అయితే కొంత కాలానికి ఫిజియోథెరపీ ఇంటికి వచ్చి చేసేవారని ఇరుగుపొరుగువారిని స్వాతి నమ్మించింది. అప్పటికే ఫిజియోథెరపీ సెంటర్‌లో పనిచేసే రాజేష్‌తో పరిచయమయ్యాక ఇంటికి పిలిపించుకొందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సుధాకర్ రెడ్డి బయటే ఉన్నాడని

సుధాకర్ రెడ్డి బయటే ఉన్నాడని


సుధాకర్ రెడ్డిని హత్య చేసిన తర్వాత శవాన్ని పర్వతాపూర్ అడవుల్లోకి తీసుకెళ్ళే సమయంలో ఇంటి ఓనర్‌తో పాటు, అదె ఇంట్లో అద్దెకు ఉండే మరో మహిళకు అనుమానం వచ్చింది. కారును ఇంట్లోకి తీసుకురావడం స్వాతి టెన్షన్‌ పడడాన్ని వారు గుర్తించారు. అంతేకాదు కారును బయటకు తీసుకెళ్లే సమయంలో గేటు వద్ద ఢీకొట్టడంతో వారికి అనుమానం మరింత ఎక్కువైంది.సుధాకర్ రెడ్డి చెప్పులు ఇంటి బయటే ఉండడం, సుధాకర్ రెడ్డి వాహనం ఇంటి వద్దే ఉండడాన్ని ఇంటి ఓనర్ గమనించారు. కొడుకు పుట్టిన రోజు ఉందని వెళ్ళే సమయంలో సుధాకర్ రెడ్డి ఎక్కడున్నాడనే అనుమానంతో స్వాతి కారులో బయటకు వెళ్ళగానే ఇంటి ఓనర్ సుధాకర్ రెడ్డి సెల్‌కు ఫోన్ చేసింది. అయితే సుధాకర్ రెడ్డి సెల్‌ను స్వాతి లిఫ్ట్ చేసింది. సుధాకర్ రెడ్డి గురించి ఆరా తీస్తే బయట ఉన్నాడని సమాధానమిచ్చిందని ఇంటి ఓనర్ మీడియాకు చెప్పారు. తాను కూడ వేరే చోట ఉన్నానని ఆమె సమాధానం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+