బిర్యానీ వండరాదని భార్యను వదిలేసిన భర్త

వరంగల్: బిర్యానీ వండడం రాదని ఓ భర్త తన భార్యను పుట్టింట్లోనే వదిలేశారు. వివాహమైన రెండు నెలలకే భార్యతో గొడవపెట్టుకొని ఆమెను పుట్టింటికే పరిమితం చేశారు. అయితే తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు గురువారం నాడు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో చోటు చేసుకొంది.

 Husband Leaves Wife For Not Cooking Biryani

బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు ఓ ప్రబుద్ధుడు. బిర్యానీ వండటం రాదన్న సాకుతో పెళ్ళైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు భర్త. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది ఓ వివాహిత.

వివరాలు... వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి ఖాజిపేట దర్గాకు చెందిన మానస అనే యువతితో 2016 నవంబరులో వివాహం జరిగింది. సుమారు రూ. 7 లక్షల కట్నం ఇచ్చారు. పెళ్ళైన రెండు నెలలకే బిర్యానీ వండట్లేదని గొడవ చేసి ఇంట్లో నుండి వెళ్లగొట్టాడని బాధితురాలు మానస తెలిపింది.

ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే రాజేంద్రప్రసాద్ రోజు తాగి వచ్చి గొడవ చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు బిర్యానీ వండడం రాలేదనే కారణంగానే తనను పుట్టింట్లోనే వదిలేశారని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+