భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త.. కానీ చివరికి !!

తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కూతురు తనను వేధిస్తున్నారని.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై భార్యను హత్య చేసినట్టు వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు ఓ భర్త. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

కాగా గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్య (42)ను హత్య చేసి.. అనంతరం తానే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒకే కుటుంబంలో రెండు ప్రాణాలు పోవడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

husband-murdered-wife-and-put-video-as-whats-app-status-at-telangana

అంతే కాకుండా భార్య, కూతురు తనను వేధిస్తున్నారని భావించిన బాలాజీ రామాచారి.. సంధ్యను తాడుతో ఉరిబెట్టి హత్య చేసి సోషల్ మీడియాలో స్టేటస్‌గా పెట్టాడు. అనంతరం తాను కూడా అదే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే బాలాజీ రామాచారికి ఇది రెండో వివాహం అని చెబుతున్నారు. మొదటి భార్య మృతి చెందడంతో కొన్నేళ్ల క్రితం సంధ్యను వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని వాటి కారణంగా బాలాజీ మానసికంగా కుంగిపోయినట్లు స్థానికులు అంటున్నారు. ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇంటిని సీలింగ్ చేసి పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలో ఏమేమి విషయాలు ఉన్నాయన్న దానిపై, కుటుంబ నేపథ్యం, ఆర్థిక లేదా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణ సంఘటనతో సీతారాంపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏ ఏతరః ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+