భార్యకు వచ్చిన వాట్స‌ప్ మెసేజ్‌ చూసి బిత్త‌ర‌పోయిన భ‌ర్త‌..! మనస్తాపంతో ఆత్మహత్య..!

హైద‌రాబాద్ : అనుమానం పెనుభూతం అంటారు. ఎదుటి వాడిమీద అనుమానం అనేదే రాకూడ‌దు. అనుమానం అనే విత్త‌నం నాటుకుంటే క్ష‌ణాల్లో అది మ‌హావ్రుక్షంగా మారిపోతుంది. ఇదే అనుమానం స్నేహితులు, బందువుల విష‌యంలో అనుమానం త‌లెత్తితే నివ్రుత్తి అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. కాని సొంత భార్య విష‌యంలో అనుమానం మొద‌లైతే దాని ప‌ర్యావ‌సానాలు మాత్రం చాలా దురుణంగా ఉంటాయి. చిన్న అనుమానం పూడ్చుకోలేని అగాధం లోకి నెట్టివేయ‌బ‌డుతుంది. పాత రోజుల్లో, ప్ర‌వ‌ర్త‌న మీద‌, ఎదుటి వ్య‌క్తుల మీద మాత్ర‌మే అనుమానాలు వ్య‌క్తం అవుతుండేవి. సాంకేతిక‌త పెరిగిపోయిన ప్ర‌స్తుత త‌రుణంలో అనుమానం ప‌లు రూపాల్లో మాన‌వ సంబంధాల‌పై దాడి చేస్తోంది.

ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన భార్య..! భ‌ర్త క్ష‌ణికావేశం..!

ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన భార్య..! భ‌ర్త క్ష‌ణికావేశం..!

స్మార్ట్ ఫోన్లు ప‌చ్చ‌ని కాపురాల్లో చిచ్చు పెడుతూ జీవిత కాల విషాదాన్ని మిగిల్చుతున్నాయి. సంతానం ఉన్న కుటుంబాలైతే అనుమాన‌మ‌నే పిశాచానికి పిల్ల‌లు అనాధ‌లుగా మారే సంద‌ర్బాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భార్య వాట్స‌ప్ కు వ‌చ్చిన ఓ మెస్సేజ్ ను చ‌దివిన భ‌ర్త అవాక్క‌య్యాడు. ఏంట‌ని నిల‌దీసిన పాపానికి స‌ద‌రు భార్యామ‌ణి ఇంట్లోనుండి వెళ్లి పోయింది. ఈ వ‌రుస సంఘ‌ట‌న‌ల‌కు క‌ల‌త చెందిన స‌ద‌రు భ‌ర్త మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. దీంతో వారి సంతానం అనాద‌గా మారిపోయింది. ఇత‌కీ సెల్ ఫోన్ వాట్స‌ప్ పెట్టిన చిచ్చు ఎక్క‌డ, ఎలా జ‌రిగింది.? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

మనస్తాపంతో భర్త ఆత్మహత్య..! అనాథగా మారిన చిన్నారి..!!

మనస్తాపంతో భర్త ఆత్మహత్య..! అనాథగా మారిన చిన్నారి..!!

ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోవడంతో భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నతల్లి వెళ్లిపోవడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో అభం శుభం తెలియని చిన్నారి ఏడుస్తుండడంతో స్థానికులు చేరదీశారు. కడప జిల్లా, ఊటూరు మండలం, డొంగూరు గ్రామానికి చెందిన ఎర్రగోను మల్లికార్జున్‌రెడ్డి కుమారుడు ఇర‌వై ఆరేళ్ల చరణ్‌రెడ్డి, విజయవాడకు చెందిన పావనిరెడ్డి ప్రేమించుకుని పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకున్నారు.

చేసుకుంది ప్రేమ వివాహం..! వైవిహిక జీవితంలో చిచ్చు పెట్టిన వాట్సాప్...!!

చేసుకుంది ప్రేమ వివాహం..! వైవిహిక జీవితంలో చిచ్చు పెట్టిన వాట్సాప్...!!

ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చరణ్‌రెడ్డి కుటుంబంతో కలిసి నాలుగు సంవత్సరాలుగా చింతల్‌ పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివసిస్తున్నాడు. వీరికి ఏడాదిన్నర వయస్సుగల బాబు ఉన్నాడు. మూడు రోజుల క్రితం భార్య పావనిరెడ్డికి ఓ వ్యక్తి నుంచి వచ్చిన ‘ఐ లవ్‌ యూ' మెసేజ్‌ను చరణ్‌రెడ్డి చూసి ఆమెను అడగగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కుమారుడిని భర్త వద్ద వదిలేసి వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన చరణ్‌రెడ్డి గురువారం రాత్రి కుమారుడిని నిద్రపుచ్చి ఇంట్లో ఐరన్‌ రాడ్డుకు చీరతో ఉరేసుకున్నాడు.

 భార్య‌కు ఐల‌వ్ యూ మెస్సేజ్..! ఖంగు తిన్న భ‌ర్త‌..! ఆత్మ‌హ‌త్య‌..!!

భార్య‌కు ఐల‌వ్ యూ మెస్సేజ్..! ఖంగు తిన్న భ‌ర్త‌..! ఆత్మ‌హ‌త్య‌..!!

శుక్రవారం తెల్లవారు జామున బాలుడు ఏడుస్తుండడంతో పక్కింటి వారు తలుపులు కొట్టగా తీయలేదు. కిటికీలో నుంచి చూడగా చరణ్‌రెడ్డి ఉరేసుకొని కనిపించడంతో పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి వెళ్లిపోవడం, తండ్రి మృతిచెందడంతో బాలుడు అనాథగా మారి దిక్కులు చూస్తుండ‌డం ప‌లువురికి కంట త‌డి పెట్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+