భార్యపై భర్త కక్ష: ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలు

హైదరాబాద్: విడిగా ఉంటున్న భార్యపై కక్షతో ఓ భర్త అత్యంత నీచమైన పనికి ఒడిగట్టాడు. నకిలీ ఖాతాలు తెరిచి, ఆమె పేరు మీద అవాంఛనీయమైన వ్యాఖ్యలు, చిత్రాలు పోస్టు చేశాడు. తనతో విడిపోయినా భార్యపై కక్ష సాధించాలనుకుని అనుచిత చర్యలకు పాల్పడిన భర్త చివరకు కటకటాల పాలయ్యాడు.

ఆంధ్రప్రదేశ్‌ అనంతపురానికి చెందిన అన్నంరాజు వెంకట రాఘవేంద్రరావుకు 2011 నవంబర్‌లో వివాహమైంది. ఈ దంపతులకు ఓ పాప జన్మించింది. వెంకట రాఘవేంద్రరావు 2011వరకు బెంగళూరులోని ఏవీసీ ఇన్ఫర్మాటిక్స్‌ సంస్థలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశాడు. తర్వాత హైదరాబాదులోని మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్‌కు మారాడు. 2013 డిసెంబర్‌ వరకు లీవోన్స్‌ కంపెనీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు.

Husband uploads abscene photos of wife in Facebook

ఆ తర్వాత వెంకట రాఘవేంద్రరావుకు భార్యతో గొడవలు మొదలయ్యాయి. 2013 ఆగస్టు నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. భార్య ప్రస్తుతం హైదరాబాదులోని శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటోంది. ఆమెపై కక్ష సాధించడానికి బేబీ ఫొటోతో 2014 నవంబర్‌లో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించాడు.

తర్వాత ఈ ఏడాది జనవరిలో భార్య ఫొటోతో మరో నకిలీ ఎఫ్‌బీ ఖాతాను సృష్టించాడు. ఇందులో ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. ‘‘నేను నా భర్తను, నా కుటుంబాన్ని ఎలా మోసం చేశానో ఈ వీడియోలోచూసి నాకు కంగ్రాట్స్‌ చెప్పండి'' అని పోస్ట్‌ చేశాడు. అలాగే పలు అసభ్యకర ఫొటోలను అప్‌లోడ్‌ చేశాడు. దీనిపై బాధితురాలు జనవరి తొమ్మిదో తేదీన సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సాంకేతిక ఆధారాలను సేకరించిన ఇన్‌స్పెక్టర్‌ పి.రాజు, ఎస్‌ఐలు జి.వెంకటరామిరెడ్డి, యు.మదన్‌గౌడ్‌ బృందం రాఘవేంద్రరావును శుక్రవారం అరెస్టు చేసింది. అతడి నుంచి నోకియా సెల్‌ఫోన్‌, హిటాచి కంపెనీకి చెందిన 320 జీబీ హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+