విస్తుపోయే నిజాలు: పోర్న్ మార్కెట్ లోను డ్రగ్స్ ముఠా.. అమ్మాయిల నగ్న చిత్రాలతో!
హైదరాబాద్: వ్యసనం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. జీవితాన్ని మత్తు ఆవహించాక.. దారి తప్పడం తెలియకుండానే జరిగిపోతుంది. మత్తు నుంచి బయటకు రావడం ఒక నరకంగా.. ఎప్పుడూ నిషాలో ఉండటానికే మనసు వెంపార్లాడుతూ ఉంటుంది.
ఈ బలహీతను క్యాష్ చేసుకునేందుకు కొన్ని ముఠాలు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాయి. హైదరాబాద్ లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో.. ఎంతోమంది అమాయక యువతులు వీరి చేతిలో మోసపోయారు. చేతిలో డబ్బుల్లేని స్థితిలో.. ఆఖరికి తమ నగ్న చిత్రాలను పంపించి మరీ.. వారు డ్రగ్స్ తెప్పించుకున్నారు. అమ్మాయిల నగ్న చిత్రాలతో సదరు గ్యాంగ్.. పోర్న్ మార్కెట్ లోను డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది.

కెల్విన్ కన్నా డానియల్ కీలకం:
హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసిన నాటి నుంచి కీలకంగా వినిపిస్తున్న పేరు 'కెల్విన్'. అయితే కెల్విన్ కన్నా డానియలే కీలక పాత్ర పోషించినట్టు ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. డానియల్‌తో పాటు నవ్యంత్ అనే మరో వ్యక్తి కూడా ఇందులో కీలకంగా ఉన్నట్లు గుర్తించారు.
పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకుని.. విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేయడంలో వీరిద్దరిదే ప్రధాన పాత్ర అని
పోలీస్ అధికారులు గుర్తించారు. డానియల్‌తోపాటు నవ్యంత్‌ను పట్టుకుంటే డ్రగ్స్ వ్యవహారంలో మరిన్ని చీకటి కోణాలు వెలుగుచూస్తాయని ఆబ్కారీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
Recommended Video


ముందు ఫ్రీగా.. ఆ తర్వాత?:
నగరంలోని కార్పోరేట్ స్కూల్స్, కాలేజీలను టార్గెట్ చేసి డానియల్ అండ్ కో తమ డ్రగ్స్ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన 29 స్కూల్స్, 27 కాలేజీలను ఎంచుకున్నారు. ఈ స్కూల్స్, కాలేజీల వద్ద డానియల్ అనుచరులు మాటు వేసి ఉండేవారు.
విద్యార్థులను ఆకర్షించి తొలుత వారికి ఫ్రీగా డ్రగ్స్ సరఫరా చేసేవారు. అలా కొన్నాళ్ల పాటు వారు దానికి రెగ్యులర్ గా అలవాటయ్యాక.. ఒక్కసారిగా ఉచితంగా ఇవ్వడం మానేసేవారు. డబ్బులిస్తేనే డ్రగ్స్ ఇస్తామంటూ డిమాండ్ చేసేవారు. దీంతో ఇంట్లో నుంచే డబ్బులు దొంగిలించి మరీ కొంతమంది విద్యార్థులు డ్రగ్స్ కొనుగోలు చేసేవారు.

నగ్న చిత్రాలు.. పోర్న్ మార్కెట్:
విద్యార్థుల వద్ద డబ్బులు లేని పరిస్థితుల్లో డానియల్ గ్యాంగ్ వారి నుంచి నగ్న చిత్రాలు డిమాండ్ చేసేది. వాటిని తమకు పంపిస్తేనే డబ్బుల్లేకుండా డ్రగ్స్ ఇస్తామంటూ షరతు పెట్టేది. అప్పటికే మత్తు కోసం పిచ్చెక్కిపోయి ఉండే కొంతమంది విద్యార్థినిలు.. తమ నగ్న చిత్రాలను వారికి పంపించేవారు.
అలా నగ్న చిత్రాలు పంపించినవారికి డానియల్ గ్యాంగ్ డ్రగ్స్ సరఫరా చేసేది. వాట్సాప్ ద్వారా అమ్మాయిలు తమ నగ్న చిత్రాలను పంపించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక మరికొంతమంది అమ్మాయిలు నేరుగా పోర్న్ సైట్లకే తమ నగ్న చిత్రాలను విక్రయించినట్లుగా గుర్తించారు. వాటి ద్వారా వచ్చిన డబ్బుతో డ్రగ్స్ కొనుగోలు చేయడం వారికి అలవాటుగా మారింది.
ఈ తరహా వ్యవహారంతో డానియల్ గ్యాంగ్ రెండు విధాలుగా లాభపడింది. అటు డ్రగ్స్ అమ్మకాలతో పాటు, ఇటు పోర్న్ సైట్ల ద్వారా కూడా సొమ్ము వెనకేసుకున్నారు.

డానియల్ పై కేసు:
మాదకద్రవ్యాల విక్రయం, సరఫరా కింద డానియల్ పై క్షన్ 67 కింద ఆబ్కారీ శాఖ కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. డానియల్ గ్యాంగ్ టార్గెట్ చేసిన స్కూల్స్, కాలేజీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఇందులో ఎక్కువ మంది డ్రగ్స్ సరఫరా, విక్రేతలుగా ఉన్నవారే. నెదర్లాండ్స్ కు చెందిన మైక్ కలింగాను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయితే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications