'క్యాన్సర్' పేరుతో పైసా వసూల్: మాయ లేడీ వేటలో పోలీసులు(ఫోటో)
ష్టపడటం కన్నా షాట్ కట్‌లో ఈజీ మనీ సంపాదించేసి.. ఒకే దెబ్బకు లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని ఆలోచించేవాళ్లకు ఈరోజుల్లో కొదువ లేదు. బుర్రలో ఆలోచన మెదలాలే గానీ 'క్యాన్సర్' డ్రామా కూడా కాసులు కూడా కురిపిస్తుంది
ఫిలింనగర్: కష్టపడటం కన్నా షాట్ కట్‌లో ఈజీ మనీ సంపాదించేసి.. ఒకే దెబ్బకు లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని ఆలోచించేవాళ్లకు ఈరోజుల్లో కొదువ లేదు. బుర్రలో ఆలోచన మెదలాలే గానీ 'క్యాన్సర్' డ్రామా కూడా కాసులు కూడా కురిపిస్తుంది. అచ్చు ఇదే తరహాలో సమియా అనే ఓ మాయ లేడీ క్యాన్సర్ పేరుతో దాదాపు రూ.40లక్షలు కాజేసింది.
వ్యాధి నయం కోసం ఉదారంగా డబ్బులిచ్చిన స్నేహితులు, సన్నిహితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. తండ్రికి ఉన్న క్యాన్సర్ ను అడ్డుపెట్టుకుని సమియా పెద్ద డ్రామానే ఆడింది. తండ్రి మెడికల్ డాక్యుమెంట్స్ పై తన పేరు రాసుకుని, తనకు క్యాన్సర్ ఉందంటూ అందరిని నమ్మించింది.

దీంతో చికిత్స కోసం సౌదీలో ఉన్న కొంతమంది సన్నిహితులు దఫ దఫాలుగా లక్షల రూపాయలు పంపించారు. . వారం క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలియజేయడంతో సౌదీ నుంచి ఇద్దరు స్నేహితులు ఆమెను పరామర్శించడానికి రాగా.. అసలు విషయం తెలుసుకుని వారు నివ్వెరపోయారు.
ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు మాయ లేడీని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సైదాబాద్ చిరునామాతో బంజారాహిల్స్‌లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆమె రశీదు పొందినట్లు గుర్తించారు. డాక్టర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకుని ఆయన్ను సంప్రదించారు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బందికి తన చిరునామాతో పాటు కొన్నిమొబైల్ నంబర్స్ కూడా ఇచ్చారు.
ప్రస్తుతం వాటన్నింటిని పోలీసులు సేకరించారు. అందులో ఒక నంబర్ సౌదీకి చెందినదిగా గుర్తించారు. తప్పుడు పాస్ పోర్టుతో అమెరికా వెళ్లేందుకు కూడా సమియా ప్రయత్నించిందన్న ఆరోపణలున్నాయి. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన హెచ్‌ఆర్ మేనేజర్ రాజారామ్ కూడా సమియాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ష్టపడటం కన్నా షాట్ కట్‌లో ఈజీ మనీ సంపాదించేసి.. ఒకే దెబ్బకు లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని ఆలోచించేవాళ్లకు ఈరోజుల్లో కొదువ లేదు. బుర్రలో ఆలోచన మెదలాలే గానీ 'క్యాన్సర్' డ్రామా కూడా కాసులు కూడా కురిపిస్తుంది. అచ్చు ఇదే తరహాలో సమియా అనే ఓ మాయ లేడీ క్యాన్సర్ పేరుతో దాదాపు రూ.40లక్షలు కాజేసింది.
ఇప్పటిదాకా అందిన ఫిర్యాదుల మేరకు ఎస్ఐ కె.వెంకటేశ్వర్లు శుక్రవారం 419, 420 ఐపీసీ సెక్షన్ల కింద సమియాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications