హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే రూ. 5 వేల ఫైన్..

ఎల్ నినో ప్రభావం కారణంగా హైదరాబాద్ లో రానున్న రోజుల్లో నీటి కష్టాలు తప్పేలా లేవు. తాగునీటిని వృథా చేయకుండా జలమండలి కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రచారాన్ని వేగవంతం చేసింది. సిటీలోని గల్లీ గల్లీలో సౌండ్ బాక్సులతో నీటి వినియోగంపై అవగాహన కల్పించేలా చాటింపు వేయిస్తోంది. ఈ క్రమంలో ఎండీ అశోక్ రెడ్డి నీటి వృథాను నివారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. నగరంలో ట్యాంకర్ల ద్వారా నీటి వృథాకు పాల్పడితే నవంబర్ 1 నుంచి సంబంధిత ట్యాంకర్ యజమానికి రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అదే ట్యాంకర్ రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే నీటి లీకేజీలు, మూతలు లేని ట్యాంకర్లను ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఉపయోగించవద్దని అధికారులకు అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇక ట్యాంకర్లలో నీటిని నింపే ముందు లీకేజీలను, మూతల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేసే వరకు నీటిని నింపరాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు బాధ్యతగా వ్యవహారించాలని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రస్తుతం సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయని.. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్లు కడిగినా, ఇంటి ముందు నీటిని వృథా చేసినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Hyd Water Board takes strict action against wastage drinking water fine of Rs 5 000 will be imposed

ఇక సింగూరు, మంజీర నదులతోపాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోనూ నీటి నిల్వలు రోజు రోజుకూ తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో రానున్న రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బంది కరమైన పరిస్థితులు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+