Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫేస్‌బుక్ పరిచయం: థియేటర్లోనే యువతిపై అత్యాచాచారం

హైదరాబాద్:ఫేస్‌బుక్ లో రెండు నెలల క్రితం పరిచయమైన యువతితో ఓ యువకుడు థియేటర్‌లోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది. విషయం బయటకు చెబితే పరువు తీస్తానని బాధితురాలిని నిందితుడు హెచ్చరించడంతో ఆమె ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు.

చివరకు తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సోషల్‌మీడియాలో జీవితంలో భాగంగా మారింది. సోషల్ మీడియా కారణంగా స్నేహితులుగా మారుతున్నారు. ఒకే రకమైన అభిప్రాయాలు, అభిరుచులు ఉన్నవారిని సోషల్ మీడియా దగ్గరకు చేరుస్తోంది.

సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితులతో స్నేహం, ఛాటింగ్ చేయడం వల్ల అమ్మాయిలు మోసపోతున్నారనే ఘటనలు వెలుగు చూస్తున్నా కానీ, పదే పదే అదే తప్పులు చేయడం వల్ల అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన బిక్షపతి ఓ యువతిపై థియేటర్‌లోనే అత్యాచారం చేశాడు.

పేస్ బుక్ పరిచయం కొంప ముంచింది

పేస్ బుక్ పరిచయం కొంప ముంచింది

ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన బిక్షపతికి ఫేస్‌బుక్ ద్వారా సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతితో పరిచయమైంది ఇంటర్ పూర్తి చేసిన ఆ యువతి ఇంట్లోనే ఉంటోంది. రెండు నెలల క్రితం బిక్షపతితో ఆ యువతికి పరిచయమైంది పది రోజులుగా వారిద్దరూ ఫేస్‌బుక్ ద్వారా ఛాటింగ్ చేస్తున్నారు పెళ్ళి చేసుకొంటానని బిక్షపతి ఆ యువతికి మాటిచ్చాడు. దీంతో ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఫేస్ బుక్ పరిచయమే కొంపముంచిందని ఆ యువతి ఆలస్యంగా గుర్తించింది.

థియేటర్‌లోనే యువతిపై అత్యాచారం

థియేటర్‌లోనే యువతిపై అత్యాచారం

ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన బిక్షపతిని ఆ యువతి 2018 , జనవరి 28వ, తేదిన కలుసుకొన్నారు. అదే రోజున సిటీలో పలు ప్రాంతాల్లో తిరిగారు.జనవరి 29వ, తేదిన కూడ వారిద్దరూ కలిసి ఇందిరా పార్క్‌లో మధ్యాహ్నం వరకు గడిపారు. మధ్యాహ్నం ప్రశాంత్ థియేటర్‌లో పద్మావత్ సినిమాకు వెళ్ళారు. థియేటర్‌లో ఓ మూలన కూర్చొన్నారు.థియేటర్లో జనం ఎక్కువగా లేకపోవడంతో ఆమెపై బిక్షపతి లైంగికదాడికి పాల్పడ్డాడు.

పరువు తీస్తానని బెదిరించాడు

పరువు తీస్తానని బెదిరించాడు

అత్యాచారానికి గురైన యువతి తీవ్ర రక్తస్రావానికి గురైంది. తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ విషయమై కుటుంబసభ్యులు నిలదీయడంతో బాధితురాలు బిక్షపతి వ్యవహరాన్ని బయటపెట్టింది. బయటపెట్టింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులకు చెప్పకుండా బాధితురాలు దాచి పెట్టింది.దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసిందని పోలీసులు చెబుతున్నారు.

బిక్షపతి అరెస్ట్

బిక్షపతి అరెస్ట్

థియేటర్‌లో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బిక్షపతిని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. సినిమా నడుస్తున్న సమయంలోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో థియేటర్ యాజమాన్యంపై కూడ కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+