కారు ఆపమన్నందుకు హోంగార్డుపైకే దూసుకెళ్లాడు (వీడియో)
కొందరు వాహనదారులు పోలీసులను కూడా లెక్క చేయకుండా వాహనాలను నడుపుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద వాహనాల బ్లాక్ ఫిల్మ్ చెకింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా హోంగార్డు రమేష్ ఓ కారును ఆపేందుకు ప్రయత్నించాడు.
అయితే డ్రైవర్ సయ్యద్ నజీర్ కారు ఆపకుండా ముందుకెళ్లబోయాడు. దీంతో రమేష్ కారుకు అడ్డుగా వచ్చి ఆపబోయాడు. డ్రైవర్ మరింత వేగంగా కారును పోనిచ్చి రమేష్‌పైకి దూసుకెళ్లాడు. హోంగార్డును కారుతో కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో రమేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు డ్రైవర్ సయ్యద్ నజీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఎస్‌ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోలీసులపై రోజురోజుకు ఇలాంటి వికృత చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటను సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Punjagutta Traffic Police Home Guard was #dragged by a car on road during vehicle checking ,driver arrested.#Hyderabad pic.twitter.com/Kd2VAWk5Kf
— Arbaaz The Great (@ArbaazTheGreat1) November 8, 2024
ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులపైనే ఇలా చేయడం సరైనది కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనాల తనిఖీలకు సహకరించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. హోంగార్డుని చూసి కూడా అతనిపైకి దూసుకెళ్లడం దారుణమని, కనీసం వారి పట్ల మానవత్వం చూపించరా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కారును ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను కారు బానెట్‌పై ఉండగానే వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు వాహనదారుడు.












Click it and Unblock the Notifications