Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మియాపూర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చంపింది స్నేహితుడే

హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేసి.. ఆమెను హత్య చేసిన నిందితుడిని గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్పందనను హత్య చేసింది ఆమె స్నేహితుడు మనోజ్ అని దర్యాప్తులో తేల్చారు. దీంతో శుక్రవారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్ 3ఏ బ్లాక్‌లో ఉండే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు నమ్రత కుమార్తె బండి స్పందన (29) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అయితే, ఇంటర్ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను ఆమె ప్రేమించింది. 2022 ఆగస్టులో పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.

Hyderabad Accused arrested in Miypur lady techie murder case

2023లో భర్త తనను వేధిస్తున్నాడంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ క్రమంలో స్పందన తన తల్లి వద్దే ఉంటోంది. సోమవారం తల్లి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులకు వెళ్లగా.. స్పందన ఇంట్లోనే ఉంది. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్ బెల్ నొక్కినా.. కుమార్తె సెల్‌ఫోన్‌కు కాల్ చేసినా స్పందించకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులను బద్దలు కొట్టింది.

రక్తపుమడుగులో స్పందన విగత జీవిగా పడివుండటాన్ని చూసిన ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో స్పందనకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. స్పందనను హత్య చేసింది మనోజ్ అలియాస్ బాలుగా పోలీసులు గుర్తించారు.

కాగా, మృతురాలు స్పందన.. మనోజ్ ఇద్దరూ ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఎప్పట్నుంచో క్లాస్‌మేట్ కావడంతో మనోజ్ ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. అయితే, ఆమెకు పెళ్లి జరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. అయితే, భర్తతో వివాదాలు రావడంతో స్పందన ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తల్లితో కలిసి ఉంటోందని తెలిసి.. మనోజ్ ప్రేమ మళ్లీ చిగురించింది.

తనను ప్రేమించాలంటూ స్పందనపై మనోజ్ ఒత్తిడి తెచ్చాడు. స్పందన తన ప్రేమను తిరస్కరించడం, సాటి ఉద్యోగులతో స్నేహంగా ఉండటాన్ని చూసి మనోజ్ తట్టుకోలేకపోయాడు. పలుమార్లు ఆమెతో మనోజ్ గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్రమైన పగ పెంచుకున్న మనోజ్.. స్పందన నివసిస్తున్న అపార్ట్‌మెంట్ లోకి చొరబడి విచక్షణా రహితంగా దాడి చేశాడు. బండరాయితో మోది, స్క్రూడ్రైవర్‌తో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. దీంతో స్పందన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు మనోజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+