ఆన్ లైన్ లో కేక్ లు ఆర్డర్ పెడుతున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..

హైదరాబాద్ లో కల్తీ దందాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ రాయుళ్లపై ఓవైపు టీజీ సేఫ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ బృందాలు ఉక్కుపాదం మోపుతున్నా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. లాభాల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నా ఈ కల్తీ ఘటనలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు మారుతున్న జీవనశైలి కారణంగా నేటి ప్రజలు చాలా మంది ఆన్ లైన్ ద్వారానే ఫుడ్, ఇతర వస్తువులు, కూరగాయలు, కేక్ లు ఇలా అన్నీ ఆర్డర్ పెడుతున్నారు. కానీ వాటిని ఎక్కడ తయారు చేస్తున్నారు..? అక్కడ పరిశుభ్రత ఎలా ఉంది..? అనే విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదు.

Hyderabad Are you ordering cakes online Destruction of 60 kg expired cake bases in a famous bakery

హైదరాబాద్ లో ఫేమస్ బేకరీగా పేరొందిన ప్రముఖ బేకరీ సంస్థ 'బేకింగో' బ్రాండ్ లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మాధాపూర్ లోని బేకింగో అవుట్ లెట్ పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్స్ పైరీ డేట్ ముగిసిన సుమారు 60 కిలోల కేక్ బేస్‌ లను గుర్తించారు. వాటిని వెంటనే అక్కడికక్కడే పారబోసి ధ్వంసం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో క్లౌడ్ కిచెన్ సిస్టమ్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి వాటిపైనే లక్ష్యంగా దాడులు చేశారు అధికారులు.

ఈ తనిఖీల్లో భాగంగా నవంబర్ 10, 2026 నాటికే ఎక్స్ పైరీ అయిన కేక్ బేస్ లను వినియోగిస్తూ.. ఫుడ్ లవర్స్ కు విక్రయించే కేక్స్ పై నవంబర్ 12 వరకు డ్యూ డేట్ ఉన్నట్లు తప్పుడు లేబుల్స్ వేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఫుడ్ అవుట్‌లెట్లపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక బేకింగో బేకరీలోని దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+