గణేష్ ఉత్సవాల్లో డీజే, టపాసులు కాల్చడంపై నిషేధం, మండపాల నమోదు తప్పనిసరి

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ ఉత్సవాల సందర్బంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. గణేష్ ఉత్సవాల సందర్బంగా ఎలాంటి టపాసులు పేల్చడకూడదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి గణేష్ ఉత్సవాలు ముగిసే సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు టపాసులు కాల్చడంపై నిషేధం అమలులో ఉంటుందని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని, ఊరేగింపులు చేసుకోవాలన్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

Hyderabad: ban on crackers during ganesh utsav in the city, mandapa registration compulsory

ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగలు సెప్టెంబర్ 28వ తేదీనే వచ్చాయి. దీంతో రెండు ఉత్సవాలు ఒకేసారి ఉండటంతో పోలీసులు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అయితే, గణేష్ నిమజ్జనం తేదీ నిర్ణయించడం జరిగింది కానీ.. మిలాద్ ఉన్ నబీ తేదీ మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

కాగా, హైదరాబాద్‌లో శాంతిభద్రతల కోసం సీరత్-ఉన్-నబీ అకాడమీ, మర్కాజి అంజుమన్ ఇ ఖద్రియా, సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియాతో సహా పలు మత సంస్థలు ఈ ఏడాది మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాయి. మసీదులను సందర్శించడం, పేదలకు సహాయం చేయడం ద్వారా మిలాద్ ఉన్ నబీ జరుపుకోవాలని నిర్ణయించారు.

గణేష్ మండపాల నమోదు తప్పనిసరి

గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహ మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలన్నింటిని సెప్టెంబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాల రిజిస్ట్రేషన్ కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల కమిటీ సూచనల మేరకు ప్రత్యేక వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htm రూపొందించారు.

మండపం వద్ద పూర్తి వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మండపాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేకున్నా.. సమాచారం మాత్రం తప్పనిసరి అనే కండిషన్ పెట్టారు. అంతేగాక, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+