బెంగళూరు, ఢిల్లీ కంటే హైదరాబాద్ అనువు: పోస్ట్ చేసిన కెటిఆర్
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ నగరం బెంగళూరులను పక్కకు నెట్టి హైదరాబాద్.. జీవించేందుకు అనువైన నగరాల్లో ముందుస్థానంలో నిలిచింది. మెర్సెర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ 2015 ప్రకారం... హైదరాబాద్ జీవించేందుకు అనువైన నగరాల్లో 138వ స్థానంలో నిలిచింది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలు కూడా ఆ తర్వాతే ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత పుణే (145), బెంగళూరు (146), చెన్నై (151), ముంబై (152), డిల్లీ (154)వ స్థానంలో ఉన్నాయి.

జీవించేందుకు అనువైన నగరాల్లో గతంలో కంటే పెద్ద తేడా ఏమి లేదు. అయితే, హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాదులోని అంతర్జాతీయ పాఠశాలలు, నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ విమానాశ్రయం, అంతర్జాతీయ ఫ్లైట్లు తదితరాల కారణంతో ముందు నిలిచింది.
ఇంటర్నేషనల్ స్కూల్స్, టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వంటి కారణంగానే మొదటి స్థానంలో నిలిచింది. కాగా, ఇందుకు సంబంధించిన ఆర్టికల్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications