హైదరాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు: మొదట బెంగళూరుకే!, మరో నగరానికి కూడా?
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad) నుంచి మరో వందేభారత్ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందు కోసం రైల్వే శాఖ కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే హైదరాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)కు కొత్త రైలును నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పర్యటన సందర్భంగానే హైదరాబాద్-బెంగళూరు వందేభారత్(Vande Bharat) రైలు ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ బీజేపీ నేతలతో చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు పలు జాతీయ మీడియా ఛానళ్లు కూడా కథనాలు వెల్లడించాయి. అయితే, ఏ తేదీన మరో కొత్త వందేభారత్ రైలు ప్రారంభిస్తారనే విషయం మాత్రం స్పష్టత రాలేదు. ఈ కొత్త రైలు కార్యరూపం దాల్చితే తెలంగాణ నుంచి ప్రారంభమయ్యే మూడో వందేభారత్ రైలు ఇదే కానుంది.

ఇప్పటికే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతిలకు రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ కొత్త వందేభారత్ రైలుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కాచిగూడ నుంచి బెంగళూరుకు ఇప్పటికే పలు రైళ్లు సేవలందిస్తున్నాయి. హైదరాబాద్-బెంగళూరు 570 కిలోమీటర్ల మార్గాన్ని ఈ రైళ్లు దాదాపు 11 గంటలపాటు ప్రయాణించి చేరుకుంటున్నాయి.
అయితే, హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్ రైలు ప్రారంభమైతే.. దాదాపు నాలుగు గంటల సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రారంభించిన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ప్రారంభిస్తే అంతకుమించిన జనాదరణ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బెంగళూరులో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక బీజేపీ నేతలు కూడా ఈ వందేభారత్ రైలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమచారం. త్వరలోనే ఈ వందేభారత్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతున్న పుణెకు మరో వందేభారత్ రైలు నడపాలని రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం.
-
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ???












Click it and Unblock the Notifications