హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ రెండు రోజుల్లో ఈ ఏరియాలలో నీళ్లు బంద్..!

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎల్ నినోతోపాటు, వర్షాభావ పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ వాసులకు ఇప్పుడు బిగ్ అలర్ట్.. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నవంబర్ 3 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి స్పష్టం చేసింది. ఈ మేరకు గండిపేట కాండ్యూట్‌ లోని సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయి. ఆ కారణంగా 36 గంటలపాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి తెలిపింది.

అటు గోషామహల్, కార్వాన్ సర్కిల్ లోని రెడ్‌ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌ నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ ఫౌండ్రీ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. అలాగే గోల్కొండ జోన్ డివిజన్-14 చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌ నగర్, అహ్మద్‌ నగర్ లోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు జలమండలి పేర్కొంది. అలాగే డివిజన్-17 లోని కవాడిగూడ సర్కిల్ లోని
కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుంది. ఇక జూబ్లీహిల్స్ సర్కిల్ డివిజన్-15 లోని పలు ప్రాంతాలు అలాగే బంజారాహిల్స్ వార్డు పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుంది.

Hyderabad Big alert for residents Water supply to be shut off in these areas on November 3rd 4th

ఇక హైదరాబాద్​ నగరానికి రోజుకు 100 ఎంజీడీ నీళ్ల లోటు ఉందని స్పష్టం అవుతోంది. వివిధ జలాశయాల నుంచి 60 ఎంజీడీల నీళ్లను సర్దుబాటు చేస్తున్నామన్నామని జలమండలి స్పష్టం చేసింది. అయితే సరఫరాలో కేవలం 40 ఎంజీడీల నీళ్ల లోటు మాత్రమే ఉందని తెలిపారు. నీళ్లను వృథా చేయొద్దని కోరుతోంది. అలాగే 'పానీ' యాప్‌ ద్వారా పౌరులు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు నీటిని వృథా చేసిన వారికి జరిమానా విధిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+