హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్‌పై కేసు నమోదు
Hyderabad: భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్‌పై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిపై రాకేశ్ జైశ్వాల్ దాడి చేశారు. దీంతో ఆయనపై బీఎన్ఎస్ యాక్ట్ 132, 352 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందిస్తూ.. అధికారులపై దాడులు చేస్తే సహించబోమన్నారు. అధికారులను పిలిచి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ పోలీసులు కమిషనర్‌కు చెప్పారు.

కబ్జాకు గురైన 12 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
బంజారాహిల్స్‌లో ఆక్రమణకు గురైన 12 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుున్నారు. శనివారం ఆ స్వాధీనం చేసుకున్న భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలను మం్తరి పొన్నం అభినందించారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే అధికారులకు చెప్పాలని మంత్రి ప్రజలకు సూచించారు.
బీటెక్ విద్యార్థికి రూ.7.8 లక్షలు టోకరా
హన్మకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడుకి ఏప్రిల్ నెల 16న ఒక నంబర్ నుంచి వాట్సప్ మెసేజ్ వచ్చింది. అయితే అందులో సూచించిన విధంగా హోటల్స్‌కు రేటింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత టెలిగ్రామ్‌లో ఇచ్చిన టాస్క్‌లు అన్ని పూర్తి చేశాడు.
అనంతరం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లాభం వస్తుందని యువకుడికి చెప్పడంతో నమ్మిన అతడు.. మొదట రూ.1000 పెట్టుబడి పెట్టాడు. దీనికి మంచి రిటర్న్స్ వచ్చినట్టు చూపించారు సైబర్ నేరగాళ్లు. దీంతో ఈజీ మనీపై ఆశతో క్రమక్రమంగా రూ.7,83,500 రూపాయలు పెట్టుబడి పెట్టాడు యువకుడు. అయితే, ఎన్ని రోజులకీ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
-
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications