హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ఐమాక్స్ స్క్రీన్.. మూవీ లవర్స్ కు ఇక పండగే..!

తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎంతలా ఆరాధిస్తారో తెలిసిందే. కథలో కొత్తదనం ఉంటే చాలు చిన్న సినిమానా..? లేక పెద్ద సినిమానా..? అని ఆలోచించకుండా బ్లాక్ బస్టర్ చేస్తారు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో వందల సంఖ్యలో థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా పలు రీజినల్ లాంగ్వేజ్ మూవీస్ నుంచి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్ వరకు హైదరాబాద్ థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. ఇక భాగ్యనగరంలో థియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని సంతరించుకుంటున్నాయి.

ఏఎంబీ, అల్లు సినిమాస్, ప్రసాద్ మల్టీప్లెక్స్, ఏఏఏ సినిమాస్, విమల్ 70 ఎంఎం, ఎపిక్ సినిమాస్.. ఇలా అనేక థియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సినిమా లవర్స్ కు మరచిపోలేని అనుభూతిని అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ థియేటర్ల సరసన సుదర్శన్ థియేటర్ చేరనుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ అంటే మూవీ లవర్స్ కు అడ్డా అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలు రిలీజ్, రీ-రిలీజ్ అవుతుంటాయి. అలాగే అనేకమంది పెద్ద హీరోల సినిమాలను కూడా సుదర్శన్ థియేటర్ లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు.

ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ మాత్రమే ఉంది. గతంలో ఉన్న సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ స్థానంలో ఏఎంబీ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉండగా అందులో ఒకటి ఐమాక్స్ స్క్రీన్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అంతే కాక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి కూడా పార్ట్నర్స్ గా ఉంటారని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇదే విషయంపై మరో నాలుగు, ఐదు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Hyderabad Cinema Fans Rejoice Sudarshan Theatre Reopens with State-of-the-Art IMAX Experience Hyd

ఇదే నిజమైతే మూవీ లవర్స్ కు పండగే అని చెప్పొచ్చు.. ఎస్. ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి చిత్రం ట్రూ ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీలో చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ లేదు.. దాంతో ప్రేక్షకులు ఆందోళన చెందారు. కానీ త్వరలోనే హైదరాబాద్ కు ఐమాక్స్ థియేటర్ రానున్న నేపథ్యంలో సినిమా లవర్స్ ఎగిరిగంతేస్తున్నారు. అలాగే కల్కి 2, రాకా లాంటి పెద్ద సినిమాలు కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానున్న తరుణంలో హైదరాబాద్ లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్స్ కావాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+