రోడ్లపై ఇలా చేస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్
హైదరాబాద్ మహానగరంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ కు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా కారణమేనని తెలిసిందే. చాలామంది రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ వినియోగించడం, వీడియోలు చూడటంపై దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తాజాగా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి చట్టవ్యతిరేక, నిర్లక్ష్యపు వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక వార్నింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లలో వీడియోలు చూడడం.. మరికొందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అదే పనిగా మాట్లాడుతూ ఇతర వాహనాలను పట్టించుకోవడం లేదు.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. డ్రైవర్, ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత అత్యంత ముఖ్యమైనదని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని తెలిపారు. క్షణిక అవసరాల కోసం ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు @hydcitypolice సంసిద్ధంగా ఉందని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ డ్ కలిగిన వారందరూ తమ ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేయాలన్నారు. ఎంసీసీ ఉల్లంఘన జరిగిన, సమస్యాత్మకంగా అనిపించిన వెంటనే డయల్ 100కి గానీ 112 గానీ కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నామని తెలిపారు.
అదే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నవంబర్ 11న నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అలాగే 14వ తేదీన కౌంటింగ్ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 21 కాగా.. నామినేషన్ల పరిశీలనకు ఆఖరి తేదీ ఈ నెల 22 ఉంది. విత్ డ్రా చేసుకోవడానికి ఈ నెల 24 చివరి తేదీగా నిర్ణయించింది.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications