‘నేను మీ అంజనీకుమార్.. పద్ధతి మార్చుకోండి’: ఉస్మానియాలో గ్యాంగ్‌రేప్‌పై సీపీ ఆగ్రహం
హైదరాబాద్: వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సీరియస్‌గా స్పందించారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను ఒంటరిగా పంపిన పోలీసుల తీరు సరికాదని, పద్ధతి మార్చుకోవాలంటూ సీపీ హితవు పలికారు.
ఈ మేరకు అంజనీకుమార్ తన వాయిస్ రికార్డింగ్‌ను వాట్సప్ ద్వారా పోలీసు అధికారులకు, సిబ్బందికి ఓ సందేశాన్ని పంపారు. 'మిత్రులారా.. నేను అంజనీకుమార్.. మీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతున్నాను. నిన్న జరిగిన సంఘటన, మీ అందరూ పేపర్‌లో చూశారు కదా..' అని ప్రశ్నించారు.

'ఒక మహిళ ఒంటరిగా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ.. మీరు బాధ్యతను మరిచి ఆమెను ఒంటరిగా అర్ధరాత్రి ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి పంపించారు. ఆమెపై అక్కడ రేప్ జరిగింది. ఆసుపత్రి అవుట్‌పోస్టులో పనిచేస్తున్న హోంగార్డు సైతం ఈ నేరంలో ఉన్నాడు. హైదరాబాద్ పోలీసులకు చెడ్డ పేరు వచ్చింది. మీకు నా విన్నపం.. ప్రతి కేసు జాగ్రత్తగా ప్రొఫెషనల్ పద్ధతిలో హ్యాండిల్ చేయాలి.. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకోండి.. జై హింద్' అని సున్నితంగా హెచ్చరించారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications