తెలంగాణ కాంగ్రెస్‌కు వార్ రూమ్ కష్టాలు- సీనియర్ నేతకు షాక్..!!
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో తలెత్తిన విభేదాలతో సతమతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా- కేసులను ఎదుర్కొనాల్సి వస్తోందా పార్టీకి. ఈ కేసుల వ్యవహారం మరింత ఆందోళనకు దారి తీస్తోంది.
ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రత్యేకంగా పోల్ స్ట్రాటజీ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ఈ టీమ్‌కు హెడ్‌గా వ్యవహరిస్తోన్నారు. సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేయడంతో పాటు కాంగ్రెస్ విజయానికి పక్కా ప్రణాళికలను రూపొందించడంలో తలమునకలై ఉందా స్ట్రాటజీ టీమ్.

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీకి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పోలీసులు షాక్ ఇచ్చారు. గత డిసెంబర్ లో సునీల్ కానుగోలు కార్యాలయంపై పోలీసులు మెరుపుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఆయన కార్యాలయం నుంచి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో అప్పట్లో ఈ దాడులు చేపట్టారు. సునీల్ కానుగోలును విచారిస్తోన్నారు. ఇప్పుడు తాజాగా సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.
ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో భాగంగా ఆయనకు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సునీల్ కానుగోలు స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన అనంతరం జరిగిన పరిణామం ఇది. కాంగ్రెస్ వార్ రూమ్ కు మల్లు రవి ఇన్ ఛార్జ్ వ్యవహరిస్తోన్న నేపథ్యంలోనే- సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications