డిప్రెషన్ తో టెక్కీ ఆత్మహత్య, బాధలు లేవన్న కుటుంబసభ్యులు

డిప్రెషన్ కు గురైన టెక్కీ తాను నివాసం ఉంటున్న హస్టల్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు . ఈ ఘటన హైద్రాబాద్ రాయదుర్గంలో చోటుచేసుకొంది. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు తన కొడుకుకు లేవని కుటుంబసభ్యులు చెబుతు

హైదరాబాద్: ఒంటరితనంతో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది ఆయన యూకె నుండి హైద్రాబాద్ కు తిరిగి వచ్చిన నాటి నుండి డిప్రెషన్ కు లోనయ్యారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు చెప్పారు. మృతుడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.

హైద్రాబాద్ లోని రాయదుర్గంలోని బాయ్స్ హస్టల్ లో ఉంటూ కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేసేవాడు 29 ఏళ్ళ అవినాష్. అవినాష్ ది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.కాగ్నిజెంట్ కంపెనీలో ఆయన అసోసియేట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

Hyderabad: Depressed techie ends his life

అయితే అవినాష్ గత ఏడాది నవంబర్ వరకు యూకెలో ఉండేవాడు. యూకె నుండి ఆయన గత ఏడాది నవంబర్ లో హైద్రాబాద్ కు వచ్చాడు. ఆనాటి నుండి ఆయన డిప్రెషన్ కు లోనయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అయితే బాయ్స్ హస్టల్ మరో మిత్రుడితో కలిసి ఆయన ఉండేవాడు. అయితే గురువారం నాడు ఆయన విధులను ముగించుకొని వచ్చిన తర్వాత రూమ్ లోనే ప్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆ సమయంలో ఆయన మిత్రుడు పని మీద బయటకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి అవినాష్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అవినాష్ రూమ్ మేట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే పోలీసులు ఆయన రూమ్ లో వెతికారు.అయితే ఈ రూమ్ లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అయితే అవినాష్ ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితులు లేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు.పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+