సౌదీలో హైదరాబాద్ వైద్యుడికి నరకం: సుష్మాను సాయం కోరిన భార్య
హైదరాబాద్: ఉపాధి కోసం వెళ్లిన సౌదీ అరేబియాలో వైద్యుడైన తన భర్తకు.. అతని యజమాని నరకం చూపిస్తున్నాడని ఓ మహిళ తెలిపింది. ఒప్పందం గడువు ముగిసినా యజమాని అతన్ని స్వస్థలానికి పంపించకుండా జీతం ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాడని వాపోయింది. తన భర్తను విడిపించండి అంటూ అతని భార్య విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరింది.
వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కి చెందిన అనిల్ మల్లం బాలయ్య అనే వ్యక్తి 2012లో సౌదీ వెళ్లాడు. అక్కడ అలీ డెంటోప్లాస్ట్ సెంటర్‌లో అనిల్ ఆర్థోడెంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. 2014లో అనిల్ తన ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నాడు.

ఆ ఒప్పందం 2016లో పూర్తైంది. అయినప్పటికీ అనిల్‌ను హైదరాబాద్‌కు పంపించడానికి యజమాని అలీ ఒప్పుకోవడంలేదు. ఉచితంగా వైద్యం చేయడంలేదని కొందరు పేషెంట్లు క్లినిక్‌పై కేసు పెట్టారని ఈ కేసు తేలేవరకు హైదరాబాద్ పంపించేది లేదని బెదిరింపులకు గురిచేస్తున్నాడు.
అంతేగాక, ఐదు నెలలుగా జీతం కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నాడు. దీంతో అనిల్ భార్య పవిత్ర మల్లం.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరింది. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి సుష్మ.. అనిల్ వివరాలు తెలుసుకుని సౌదీ రాజధాని రియాద్‌లోని భారత దౌత్యాధికారులకు పంపారు. దీంతో వారు ఈ విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications