అమెరికాలో హైదరాబాద్ వైద్యుడి పాఠాలు
హైదరాబాద్: అమెరికా దేశంలో అక్కడి వైద్యులకు పాఠాలు చెప్పిన ఘనతను హైదరాబాద్‌కు చెందిన వెన్నుపూస వైద్య నిపుణుడు డాక్టర్ సురేష్‌బాబు దక్కించుకున్నారు. ప్రపంచ స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీలో సురేష్‌బాబు ఘనతకు పురస్కారం కూడా లభించింది.
చిన్నతనంలోనే వెన్నుపూస వంకర్లుపోయిన చిన్నారులకు ఆ వ్యాధిని సరిచేయడంలో సురేష్ ఖ్యాతినార్జించారు. దీనికోసం కొత్త వైద్యాన్నికూడా ఆయన కనుగొన్నారు. సుమారు 15 మంది చిన్నారులకు వైద్యం చేసి వైద్య విధానాన్ని ధృవీకరించారు.

వెన్నుపూస వైద్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ కనపరచిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి పురస్కారం అందించడమే కాకుండా, అమెరికాలోని ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పే అవకాశాలు కూడా రీసెర్చ్ సొసైటీ కల్పిస్తుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి అవకాశం పొందిన సురేష్‌బాబు నాలుగు వారాలపాటు న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలంబియా, శాండియాగో, శాన్‌ప్రాన్సిస్కో విశ్వవిద్యాలయాల్లో వెన్నుపూస వైద్యంపై వివరించారు. అలాగే అక్కడ అమలుచేస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేశారు.
అమెరికాలో 30 వేల డాలర్ల వరకు వెన్నుపూస వైద్యానికి ఖర్చు అవుతుండగా, సురేష్‌బాబు వైద్యం మాత్రం 1500 డాలర్లకే జరుగుతుండడంపై అమెరికాలో ప్రశంసలు లభించాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications