ట్విస్ట్: బ్లడ్ ఇస్తానని ముమైత్ చెప్పినా నో చెప్పిన సిట్, జవాబు దాటవేత
డ్రగ్ కేసులో విచారణను ఎదుర్కొన్న ముమైత్ ఖాన్ విషయంలో ట్విస్ట్. ఆమె శాంపిల్స్ ఇస్తామంటే అధికారులు తీసుకోలేదని తెలుస్తోంది.
హైదరాబాద్: డ్రగ్ కేసులో విచారణను ఎదుర్కొన్న ముమైత్ ఖాన్ విషయంలో ట్విస్ట్. ఆమె శాంపిల్స్ ఇస్తామంటే అధికారులు తీసుకోలేదని తెలుస్తోంది.
చదవండి: రవితేజ చుట్టు ఉచ్చు?: డ్రగ్ ముఠాతో పరిచయం ఎలా.. విస్తుపోయే అంశాలు?
తాను డ్రగ్స్ తీసుకోననని చెప్పేందుకు విచారణ సమయంలో తనంతట తానే తల వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్ ఇస్తానని ముమైత్ చెప్పారు. అయితే, అందుకు సిట్ నో చెప్పిందని తెలుస్తోంది. ఆమె స్వచ్చంధంగా ముందుకు వచ్చినా.. అవసరమైనప్పుడు తీసుకుంటామని చెప్పారు.

కీలక విషయాలు వెల్లడి.. మీడియాతో మాట్లాడకుండా
తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదని చెప్పేందుకే ముమైత్ ఖాన్ శాంపిల్స్ ఇచ్చేందుకు స్వయంగా ముందుకు వచ్చిందని తెలుస్తోంది. అయితే, ఆమె కీలక విషయాలు వెల్లడించినందున ప్రస్తుతానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడాన్ని పక్కన పెట్టారని సమాచారం. కాగా, సిట్ విచారణ అనంతరం ముమైత్ ఖాన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లారు.

పుణే వెళ్లిపోయిన ముమైత్ ఖాన్
విచారణ అనంతరం ముమైత్ ఖాన్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి పుణే బయలుదేరారు. ఉదయం నాంపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆమెను నేరుగా ఐదో అంతస్థులోకి తీసుకెళ్లి విచారించారు.

ఏ భాషలో సమాధానం చెబుతారంటే
ఏ భాషలో సమాధానం చెబుతారని అడగ్గా.. తాను హిందీలో చెబుతానని, మధ్యమధ్యలో ఇంగ్లీష్‌లో చెబుతానని తొలుత ముమైత్ అధికారులకు చెప్పిందని సమాచారం. విచారణ అనంతరం ఆమె పుణే వెళ్లిపోయారు. ముమైత్ ఖాన్‌ను కూడా పూరీ జగన్నాథ్ కేంద్రంగానే విచారణ జరిపారని తెలుస్తోంది.

ముక్తసరిగా, జవాబులు దాటవేత
విచారణలో ముమైత్ ఖాన్ పలు ప్రశ్నలకు ముక్తసరిగా జవాబులు చెప్పిందని తెలుస్తోంది. ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేసిందని తెలుస్తోంది. తరుణ్, నవదీప్‌లకు నటులకు పబ్బులు ఉన్న విషయం తనకు తెలియదని చెప్పింది. అలాగే, తాను ఫ్రూట్ జ్యూస్ తాగుతానే తప్ప, డ్రగ్స్ తీసుకోనని చెప్పిందని తెలుస్తోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications