డ్రగ్ రాకెట్లో వ్యాపారవేత్తలు: విచారణలో 'పెద్ద' పేర్లు, అందుకే అథ్లెటిక్ డోపింగ్ మిషన్
డ్రగ్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలువురు వ్యాపారులకు కూడా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్: డ్రగ్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలువురు వ్యాపారులకు కూడా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇచ్చింది.
ఇందులో భాగంగా మంగళవారం ముగ్గురు వ్యాపారులను ప్రశ్నించింది. బానోతు సౌరభ్, ఆకుల రితికేష్, అంకిత్ అగర్వాల్ అనే ముగ్గురు వ్యాపారులను సిట్ విచారించింది.

రెండేళ్లుగా కెల్విన్ నుంచి కొనుగోలు
డ్రగ్ సరఫరాదారు కెల్విన్ నుంచి పెద్ద మొత్తంలో వారు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించిందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా వారు డ్రగ్స్ వాడుతున్నారని గుర్తించారని తెలుస్తోంది.

వీరి విచారణ..
మరోవైపు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు సుమారు నాలుగైదు గంటలు విచారించారు. పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నాలను ఇప్పటి దాకా దర్యాఫ్తు బృందం విచారించింది.

విచారణలో 'పెద్ద' పేర్లు.. అందుకే అథ్లెటిక్ డోపింగ్ మిషన్
విచారణలో పలువురు పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లను వీరు వెల్లడించినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే, ఆధారాలు లేకుండా ఎవరికీ నోటీసులు ఇవ్వలేమని అంటున్నారు. నార్కోటిక్‌తో పాటు అథ్లెటిక్ డోపింగ్ టెస్ట్ మిషన్ తెచ్చి పరీక్షిస్తామని చెబుతున్నారు.

గుడ్డిగా విచారించలేరు
విచారణలో పలువురు పెద్ద నిర్మాతలు, హీరోల పేర్లు చెబుతున్న నేపథ్యంలో గుడ్డిగా నోటీసులు ఇవ్వలేరు. అలాగే, వారిని కూడా గుడ్డిగా విచారించలేరు. అందుకే ఎక్సైజ్ అధికారుల నోట్ అథ్లెటిక్ డోపింగ్ టెస్ట్ మిషన్ అని వచ్చిందని అంటున్నారు. కేసులో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్ తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయడంపై ఎక్సైజ్ శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications