రవితేజపై సిట్ ప్రశ్నల వర్షం: ఆ కీలక ప్రశ్నలివే?

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు హీరో రవితేజపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో నిందితుడైన జీషాన్‌కు రవితేజకు 8ఏళ్లుగా పరిచయం ఉందని, అరేళ్లక్రితం జిషాన్.. కెల్విన్‌ను రవితేజకు పరిచయం చేశాడని తేలింది. ఈ సమాచారం అధారంగా విచారణ కొనసాగుతోంది.

వారితో ఎన్నేళ్లుగా పరిచయం

వారితో ఎన్నేళ్లుగా పరిచయం

ఇక సిట్ రవితేజను అడుగుతున్న ప్రశ్నలివేనని తెలుస్తోంది.. మీ సోదరులకూ, మీకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా..?, కెల్విన్, జీషాన్‌లు మీకు ఎన్నాళ్లుగా పరిచయం? అని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. పూరితో సినిమా షూటింగ్‌ల సమయంలో ఎక్కెడెక్కడికి వెళ్లేవారు? అని ప్రశ్నించినట్లు సమాచారం.

Recommended Video

    Ravi Teja Skipped His Brother Bharat's Funeral? Find out the Facts | Filmibeat Telugu
    డ్రగ్స్ ఎక్కడ తీసుకునేవారు?

    డ్రగ్స్ ఎక్కడ తీసుకునేవారు?

    ఇంకా.. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కడ గడుపుతారు?, విదేశాలకు వెళ్లినప్పడు మీ అలావాట్లు ఎంటి? అని ప్రశ్నించారు. జీషాన్, కెల్విన్‌లతో పరిచయం కావాడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి?, ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లలలో కెల్విన్‌కు మీతో పనేంటి?డ్రగ్స్ మీరొక్కరే తీసుకునే వారా..? ఇంకా సహ నటులు ఎవరైనా ఉన్నారా? అంటూ ఆరా తీసినట్లు తీసినట్లు సమాచారం.

    మీ సోదరుల గురించి ఆరోపణలు నిజమేనా?

    మీ సోదరుల గురించి ఆరోపణలు నిజమేనా?

    ఏ ఏ పబ్‌లకు ఎక్కువగా వెళ్తారు?, మీ రక్త నమూనాలు మేము తీసుకోవచ్చా?, డ్రగ్స్ మానేశారా? ఇంకా వాడుతున్నారా? తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి?భరత్ మీ కోసమే డ్రగ్స్ సప్లైగా అవతారం ఎత్తాడన్నది నిజమేనా?, రఘుకు ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్‌తో లింకులు కొనసాగుతున్నాయా? అంటూ ప్రశ్నించినట్లు తెలిసింది.

    పూరీ బ్యాచ్‌తో ఎలా పరిచయం? సలహాలు తీసుకున్నారా?

    పూరీ బ్యాచ్‌తో ఎలా పరిచయం? సలహాలు తీసుకున్నారా?

    ఏడేళ్ల క్రితం అరెస్ట్ సమయాల్లో మీరు తప్పించుకున్నారని అరోపణలున్నాయి.. నిజమేనా?, షూటింగ్ లేని సమయాల్లో గోవా, బ్యాంకాక్‌లో ఎలాంటి పార్టీలు చేసుకుంటారు?, పూరితో ఎన్నేళ్లుగా పరిచయం.. ముమైత్, చార్మి.. పూరి ద్వారానే పరిచయం అయ్యారా?, విచారణకు ముందు ఎవరెవరి సలహాలు తీసుకున్నారు? అని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి సునిశిత ప్రశ్నలడుగుతూ సిట్ అధికారులు రవితేజ నుంచి కీలక సమాచారం రాబడుతున్నట్లు తెలిసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+