కరోనా: వామ్మో.. ఫేక్ pm cares id, ట్రాక్ చేసిన cert-in, ఐపీసీ, ఐటీ యాక్ట్ కింద కేసు..

కరోనా వైరస్ కోసం ఆర్థిక సాయం చేసేందుకు 'పీఎం కేర్స్'కు ఫండ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. దీంతో సాధారణ ప్రజలు pm caresకు ఫండ్ అందజేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. పీఎం కేర్ యూపీఐకి దగ్గరలో మరో యూపీఐ ఐడీని క్రియేట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సైబర్ ముఠా నకలీ యూపీఐ ఐడీ క్రియేట్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో పీఎం కేర్స్ విరాళాలు వస్తున్నాయి. దీంతో తాము క్యాష్ చేసుకుందామని కేటుగాళ్లు అనుకొన్నారు. ఒరిజినల్ యూపీఐ ఐడీ pmcares@sbi కాగా దానికి పున:సృష్టిలా ఐడీ క్రియేట్ చేశారు. దీనిని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ట్రాక్ చేసింది. pmcares@sbi సమానంతో యూపీఏ ఐడీతోపాటు pmcares@pnb, pmcares@hdfc, pmcares@yesbank, pmcares@ybi, pmcares@upi, pmcares@icici ఐడీలను కనుక్కొన్నామని పేర్కొన్నారు.

Hyderabad fraudster creates fake PM CARES ID, booked under It act

pmcares@sbi నిజమైన ఐడీ అని.. నగదు పంపించేప్పుడు ప్రజలు గమనించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అకౌంట్ పేరు pmcares అని కనిపిస్తోందని.. గమనించాలని సూచించారు. లేదంటే pmindia.gov.in వెబ్‌సైట్ చూడాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. సైబర్ కేటుగాళ్లపై సుమోటోగా కేసు నమోదు చేశామని వివరించారు. ఐటీ యాక్ట్ కింద 66సీ అండ్ డీ, ఐపీసీ 420, 419 కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+