Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'కేసీఆర్! ఇవాంకాకు రూ.కోటి నగ అవసరమా': కనుసైగ చేస్తే కరిచి చంపేసే జాగిలాలు

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి విలువైన నగను ఇవ్వడం ఏమిటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆదివారం నిలదీశారు.

హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి విలువైన నగను ఇవ్వడం ఏమిటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆదివారం నిలదీశారు.

ఇవాంకా హైదరాబాద్ పర్యటన కథనాలు

ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు

ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు

ఆయన సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల సొమ్మును కేసీఆర్ ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రైతులను పట్టించుకోకుండా, హంగు, ఆర్భాటాలకు పోతోందని ధ్వజమెత్తారు. పాలకుల దుర్మార్గాలే దేశ పేదరికానికి కారణం అని మండిపడ్డారు.

 మెరుపుదాడి చేసే ఆక్టోపస్ జాగిలాలు

మెరుపుదాడి చేసే ఆక్టోపస్ జాగిలాలు

కఠినమైన శిక్షణలో రాటుదేలిన పోలీసు జాగిలాలను ప్రధాని మోడీ, ఇవాంకా భద్రతలో భద్రతా సిబ్బంది వినియోగిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు శక్తిమంతమైన ఆక్టోపస్‌ విభాగాన్ని ఉపయోగిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ట్రైనర్‌ ఇచ్చే ఆదేశాల మేరకు వేగంగా టార్గెట్‌పై దాడిచేసి మట్టి కరిపించగలగడం ఆక్టోపస్‌ జాగిలాల ప్రత్యేకత. మోడీ, ఇవాంక భద్రతకు ఆక్టోపస్‌ కమెండోలను వినియోగించనున్నారు.

 తేలికపాటి డ్రోన్లు

తేలికపాటి డ్రోన్లు

తేలికపాటి డ్రోన్లను కూడా వినియోగించనున్నారు. ఇవి రాత్రిళ్లు కూడా స్పష్టంగా వీడియో తీసి అక్కడి పరిస్థితులను ప్రత్యేక కంట్రోల్‌ రూంకు చేరుస్తాయి. శంషాబాద్‌ విమానాశ్రయం, హెచ్‌ఐసీసీ, మియాపూర్‌ మెట్రో స్టేషన్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోటలను శనివారం పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు.

 అభివృద్ధి పనులపై

అభివృద్ధి పనులపై

అమెరికా పోలీస్‌, ఎస్పీజీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లతోపాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా చర్యలను సమీక్షించారు. మాదాపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్న అభివృద్ధి పనులపై అసహనం వ్యక్తం చేయడంతో పాటు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

ఇవాంకాకు అమెరికా అద్యక్షుడికి కల్పించే స్థాయి భద్రత

ఇవాంకాకు అమెరికా అద్యక్షుడికి కల్పించే స్థాయి భద్రత

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇవాంకాకు అమెరికా అధ్యక్షుడికి కల్పించేంత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులు ప్రయాణించే ఔటర్‌పై భద్రతకు 30 కి.మీ.కు 28 గస్తీ వాహనాల్ని ఏర్పాటు చేస్తున్నారు.

 సదస్సుకు వచ్చే అతిథులతో ఎలా ఉండాలంటే

సదస్సుకు వచ్చే అతిథులతో ఎలా ఉండాలంటే

ఒక్కో వాహనంలో ఆయుధాలు, సాంకేతిక పరికరాలతో నలుగురు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. సదస్సుకు వచ్చే అతిథులతో ఎలా వ్యవహరించాలనే దానిపై సిబ్బందికి ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+