హైదరాబాద్‌లో మరో గ్రాండ్ అట్రాక్షన్: 24/7 ఓపెన్..!!
హైదరాబాద్: హైదరాబాద్‌లో రోజుకో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. ఇటీవలే హుస్సేన్ సాగర్ వద్ద లేక్ ఫ్రంట్ పార్క్ ప్రారంభమైంది. మొత్తం 26 కోట్ల రూపాయలతో ఈ పార్క్‌ను నిర్మించిన పార్క్ అది. నగర సుందరీకరణలో భాగంగా దీన్ని నిర్మించింది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు తాజాగా మరో అట్రాక్షన్ అందుబాటులోకి వచ్చింది.
అదే- సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్. దేశంలో మొట్టమొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఇది. దీని పొడవు 23 కిలోమీటర్లు. తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి కొల్లూరు వరకు దీన్ని నిర్మించారు. అవుటర్ రింగ్ రోడ్‌ను ఆనుకునే ఇది నిర్మితమైంది. 23 కిలోమీటర్ల ట్రాక్ పొడవునా సౌర విద్యుత్ ఫలకాలను అమర్చారు.

వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తవుతుంది. దీన్ని లైటింగ్ కోసం వినియోగిస్తారు. ఈ సైక్లింగ్ ట్రాక్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం ప్రారంభించారు. ట్రాక్‌లో అయిదు యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. ఇవి కార్లు- సైకిల్ పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, సైకిల్ రిపేర్, రెంటల్ స్టేషన్‌లు, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్‌లు, విశ్రాంతి ప్రదేశాలు, సిగ్నలింగ్.. వంటివి నిర్మితం అయ్యాయి.
ట్రాక్ పైకప్పునకు మొత్తంగా 16,000 సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. వాటి ద్వారా 16 మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని లైటింగ్, సిగ్నలింగ్ కోసం వినియోగిస్తారు. ఫలితంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీకి విద్యుత్ ఛార్జీల భారం తగ్గినట్టవుతుంది. ట్రాక్ స్ట్రెచ్ మొత్తాన్నీ ఒక సంవత్సర కాలంలో నిర్మించారు.

సోమవారం నుంచి ఈ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి వస్తుంది. సైక్లిస్టుల కోసం 24/7, 365 రోజులు తెరిచి ఉంటుంది. సైక్లిస్టులు ఎప్పుడైనా ఈ ట్రాక్‌ను వాడుకోవచ్చు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఈ ట్రాక్‌పై సైక్లింగ్ చేయవచ్చు. ఇలాంటి ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడం వల్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications