వెయ్యి కోట్లతో హైద్రాబాద్‌లో: పిచాయ్‌కి కెటిఆర్ థ్యాంక్స్, గూగుల్ మెయిన్ ఆఫీస్ ఇలా...
న్యూఢిల్లీ: భారత దేశ అవసరాల దృష్ట్యా కొత్త ఉత్పత్తుల కోసం హైదరాబాదులో నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సుందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం తన భారత్ పర్యటనలో గూగుల్ పిచాయ్ మాట్లాడుతూ... హైదరాబాదులో కొత్త ప్రాంగణం ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెడతామన్నారు. 20 లక్షల మంది కొత్త ఆండ్రాయిడ్ డెవరలప్లకు శిక్షణ ఇస్తామన్నారు. వంద రైల్వే స్టేషన్లకు ఉచితంగా ఇంటర్నెట్ కల్పిస్తామని చెప్పారు.
అమెరికా ఆవల, దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నామంటూ సుందర్ పిచాయ్ బుధవారం ఢిల్లీలో చేసిన ప్రకటన హైదరాబాద్ ఐటీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎంత పెట్టుబడి పెట్టబోతున్నదీ వెల్లడించలేదు.

అయితే, సుమారు వెయ్యి కోట్ల రూపాయల్ని ప్రాథమికంగా గూగుల్ హైదరాబాద్ ప్రాంగణంపై ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో 7.2 ఎకరాల స్థలాన్ని గూగుల్‌కు ఇచ్చింది.
వచ్చే ఏడాదిలో నిర్మాణం ఆరంభమయ్యే ఈ ప్రాంగణాన్ని 2019కల్లా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న గూగుల్ ప్రాంగణం తాత్కాలిక పద్ధతిలో కొనసాగుతోంది. ఇందులో ఏడువేల మంది పని చేస్తున్నారు. పర్మినెంట్ వేదిక వస్తే ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది.
అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా ఉన్న గూగుల్‌కు నలభై దేశాల్లో ప్రాంగణాలున్నాయి. కాలిఫోర్నియా ఆవల ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాంగణాల్లో హైదరాబాద్ ప్రాంగణం ఒకటిగా ఉండబోతోంది. ఈ ప్రాంగణం ఏర్పాటుతోపాటు భారత్‌లో గూగుల్ కార్యక్రమాల విస్తరణ కోసం, హైదరాబాద్‌లో పని చేసేందుకు భారీగా ఉద్యోగ నియామకాలు కూడా చేపడతామని సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఇటీవలే దేశంలో అతిపెద్ద స్టార్టప్ కేంద్రం టీ హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు గూగుల్ సీఈవో ప్రకటనతో అనేక సంస్థలు హైదరాబాదులో పెట్టుబడులకు ముందుకు వచ్చే అవకాశముంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది.
గూగుల్ ప్రధాన కార్యాలయంలో డ్రెస్ కోడ్ ఏమీ ఉండదు. అక్కడ పని చేసేవారిని గూగులర్లు అని, కొత్త వారిని నూగ్లర్ అంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ఎక్కడకు వెళ్లినా.. స్కేట్ బోర్డులపై, సైకిళ్ళపై వెళ్లొచ్చు. పర్యావరణహితంగా కార్యాలయం ఉంటుంది. ఇందుకు ఉద్యోగులకు రాయితీ ఇస్తుంది.
గూగుల్‌లో పై నుంచి కిందిదాకా ఉద్యోగుల్లో హోదాల తారతమ్యాలుండవు. తన ఉద్యోగుల 20 శాతం సమయం సొంత ఆలోచనల పైన గడిపేందుకు ప్రోత్సహిస్తుంది. ఉద్యోగులు కేటాయించిన స్థలంలోనే నిత్యం కూర్చోవాల్సిన పనిలేదు. అలా తిరిగి రావొచ్చు.
-
నెలకు రూ. 1,47,760 వరకు జీతంతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications