వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణ, శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యాలకు షాకిచ్చిన హైకోర్టు

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరమని ఉమ్మడి హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. లక్ష్య సాధన కోసం తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడిని పిల్లలు తట్టుకోలేకపోతున్నారని ఉన్నత న్యా

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరమని ఉమ్మడి హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. లక్ష్య సాధన కోసం తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడిని పిల్లలు తట్టుకోలేకపోతున్నారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా నారాయణ, శ్రీ చైతన్య కళాశాల యజమాన్యాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు.. నారాయణ, శ్రీచైతన్య కళాశాలలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ap-high-court

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన లోక్ సత్తా ఎజిటేషన్ సొసైటీ జిల్లా కో కన్వీనర్ దాసరి ఇమ్మాన్యుయేల్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.

దీనిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం రెండు రాష్ట్రాల సీఎస్‌లు, విద్య, హోం శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంటర్ బోర్డులు, స్విమ్స్, నిమ్స్‌తో పాటు నారాయణ, శ్రీచైతన్య కళాశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది.

Recommended Video

Narayana College Principal Audio Tape Leaked 'ఆడియో టేపు' లీక్ | Oneindia Telugu

నోటీసులు అందుకున్న వారు మూడు వారాల్లోగా వాటికి తగిన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

English summary
The Hyderabad High Court on Monday admitted a Public Interest Litigation (PIL) on the increase of student suicides in Telangana and Andhra Pradesh. In a letter written by a social activist and co-convener of the Lok Satta Agitation Society in Prakasam district, Dasari Emmanuel, who alleged that one of the main offenders, Narayana Junior College, was owned by a cabinet Minister from Andhra and claimed that 10 students ended their lives in the recent past from Narayana and the Sri Chaitanya group of institutions.The Court issued summons to the chief secretaries of both the states, along with other officials while marking the directors of Narayana and Sri Chaitanya colleges as respondents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X