హైటెక్ సెక్స్ రాకెట్: అమ్మాయిలకు ఫ్రూట్స్ పేర్లు, ఏం పండు తింటారంటూ వాట్సాప్ మెసేజ్‌లు
హైదరాబాద్: ఇప్పటికే నగరంలో డ్రగ్స్ కేసులు కలకలం రేపుతుండగా.. మరోవైపు ఫైవ్ స్టార్ హోటళ్లలో సెక్స్ రాకెట్ వ్యవహారం వెలుగు చూసింది. విదేశీ అమ్మాయిలతో ఫైవ్ స్టార్ హోటళ్లలో వ్యభిచార కార్యకలాపాలను కొనసాగిస్తున్న ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆయాదేశాలకు చెందిన అమ్మాయిలకు సీక్రెట్ కోడ్లను కూడా పెట్టుకోవడం గమనార్హం.

అమ్మాయిల కోడ్‌లు.. యాపిల్ కావాలా.. చెర్రీ కావాలా? అంటూ..
యాపిల్, చెర్రీ, నారింజ, జామ, తదితర పండ్ల పేర్లతో ఆయా దేశాలకు చెందిన అమ్మాయిలకు సీక్రెట్ కోడ్లు పెడుతున్నారు సెక్స్ రాకెట్ నిర్వహాకులు. ఆయా పండ్ల పేర్లను సందేశం ద్వారా పంపి బుకింగ్ చేసుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుగా వ్యవహరిస్తున్నా.. పోలీసులు మాత్రం ఆ గుట్టును రట్టు చేశారు. వాట్సాప్ ద్వారానే సెక్స్ రాకెట్ వ్యవహారాలను నడిపిస్తోంది ఈ సెక్స్ రాకెట్ ముఠా.
ఆస్ట్రేలియా అమ్మాయిలైతే చెర్రీస్ అని, మనదేశానికి చెందిన వాళ్లైతే యాపిల్ అని పేర్లు పెట్టి.. ఏ పండ్లు తింటారు.. ఏం తీసుకురమ్మంటారు? అంటూ ఎవరికీ అనుమానం రాకుండా కస్టమర్లకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతుంటారు ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకులు. ఖరీదైన హోటళ్లలో విదేశీ యువతులతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

విజిటింగ్ వీసాలపై అమ్మాయిలను రప్పించి..
ఇటీవల గచ్చిబౌలిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌పై ఆకస్మిక దాడి చేసి ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన సెక్స్ రాకెట్ నిర్వాహకుడు మణికేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వెల్లడైన అంశాలు పోలీసులను విస్తుగొలిపేలా చేశాయి. కజకిస్థాన్, తాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్ నుంచి యువతులను విజిటింగ్ వీసాపై భారత్‌కు రప్పించి, వీసా గడువు ముగిసే వరకు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాలకు తిప్పుతుంటారు.

ఫైవ్ స్టార్ హోటళ్లలోనే హై లెవల్ ప్రాస్టిట్యూషన్..
ఆయా నగరాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒకట్రెండు రోజులు మాత్రమే యువతులను ఉంచుతారు. అమ్మాయిలను ఎప్పుడు ఎక్కడికి తీసుకొచ్చేది ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తుంది. విటుల్లో సంపన్నులు, వారి పిల్లలు, సాఫ్ట్‌వేర్ ఇంజీనర్లు, కంపెనీల్లో ఉన్నత పదవులు నిర్వహిస్తున్నవారే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో విదేశీ యువతులకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వారి నుంచి భారీ మొత్తంలో నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్రమంగా యువతుల బస.. ప్రముఖుల నుంచి భారీ వసూళ్లు
అంతేగాక, కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంచి వారితో తమ వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కాగా, మణికేష్ ఫోన్ ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖుల ఫోన్ నెంబర్లు, వారితో జరిపిన వాట్సాప్ సందేశాలు చూసి పోలీసులు షాకయ్యారు. మరింత లోతుగా విచారణ జరిపేందుకు నిందితుడు మణికేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు
Recommended Video

నగరంలో డ్రగ్స్ కలకలం..
మరోవైపు, డ్రగ్స్ వ్యవహారాలు నగరంలో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా, నిషేధిత హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో చిక్కిన ఇద్దరు నిందితుల నుంచి 25 బాక్స్‌ల హాష్ ఆయిల్‌ను, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. లక్ష రూపాయల విలువ చేసే నార్కోటిక్ పరికరాలు పట్టుబడడంతో దర్యాప్తును మరింత లోతుగా చేస్తున్నారు పోలీసులు. యువతను టార్గెట్ చేసి మత్తు పదార్థాలకు బానిసలయ్యేలా చేసి వారికి డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, బోరబండకు చెందిన మహబూబ్ అలీ ఈ కేసులో ప్రధాన నిందితుడు. మహబూబ్ అలీపై రెండు దోపిడీ కేసులు, హత్యాయత్నం కేసు ఉన్నాయి. కూలీగా పనిచేసే ఇబ్రహీంఖాన్, విద్యార్థి ఖాజా ముబీనుద్దీన్ ఇద్దరు గంజాయి, హాష్ ఆయిల్, డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. విక్రయాలు కూడా చేస్తున్నారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహబూబ్ అలీ గాలింపు చేపట్టారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications