హైదరాబాద్‌లో దారుణం: యువతిని ప్రేమలోకి దింపి, కిడ్నాప్‌.. ఆపైన...

హైదరాబాద్: భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతితో స్నేహం పెంచుకుని ఆమెను ప్రేమలోకి దించిన ఓ యువకుడు చివరికి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆదివారం సాయంత్రం ఆ యువతి ఫోన్ నుంచి ఆమె తల్లికి వాట్సప్‌లో ఓ వీడియో అందింది.

ఆ వీడియోలో సదరు అమ్మాయిని చూపిస్తూ ఓ యువకుడు రూ.లక్ష ఇస్తేగాని ఆ అమ్మాయిని వదలనంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

girl-kidnapped

ఆ వీడియో చూసిన పోలీసులు.. మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నగరంలోని చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో జరిగింది.

తమ కుమార్తె రెండ్రోజుల నుంచి కనపడడం లేదని, శనివారం రాత్రే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆదివారం తమకు ఒక వాట్సప్ మెసేజ్ వచ్చిందని, దాన్ని కూడా పోలీసులకు అందించామని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+