13 నిమిషాల్లోనే.. హైదరాబాద్ మెట్రో గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అత్యవసరమైన సమయాల్లో వేగంగా వెళ్లడం కూడా వీలుండదు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తిని ప్రాణాలు కాపాడేందుకు మెట్రో రైలును ఆశ్రయించారు. ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకపూల్‌లోని గ్లెనీగిల్స్ గ్లోబల్ ఆస్పత్రికి గెండును తరలించాల్సి ఉండటంతో హైదరాబాద్ మెట్రో అధికారులను సంప్రదించారు.
దీంతో మెట్రో రైలు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ మెట్రో రైలు గ్రీన్ కారిడార్ ద్వారా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకపూల్ గ్లెనీగిల్స్ గ్లోబల్ ఆస్పత్రికి దాత గుండెను సురక్షితంగా వేగంగా తరలించారు. హైదరాబాద్ మెట్రో రైలు, వైద్య నిపుణులు, ఆస్పత్రి అధికారుల సమన్వయంతో ఈ పని విజయవంతమైంది.

ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటం కోసం మెట్రో సిబ్బంది, వైద్య బృందం కిలిసి ప్రతిచోటా పూర్తి సమర్థతతో పనిచేశారు. అనుకున్న సమయంలో గుండె గమ్యస్థానం చేరడంతో.. గుండె మార్పిడికి సంబంధిత ప్రక్రియలన్నింటినీ వైద్యుల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.
In an incredible display of efficiency & coordination,Hyderabad Metro Rail created a dedicated Green Channel on Friday night. The corridor facilitated swift & seamless transportation of a donor heart from L B Nagar's Kamineni Hospitals to Gleneagles Global Hospital, Lakdi-ka-pul. pic.twitter.com/k5rFmrEbhu
— Bachanjeetsingh_TNIE (@Bachanjeet_TNIE) January 17, 2025
హైదరాబాద్ మెట్రో రైలు రోజుకు లక్షల మంది నగర వాసులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తరలించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా, హైదరాబాద్ మెట్రో రైలు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఓ ప్రాణాన్ని కాపాడటంతో అందరి మన్ననలను పొందుతోంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications