హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పండుగ లాంటి వార్త!

హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రయాణం చేసేవారికి శుభవార్త. హైదరాబాద్ మెట్రోలో ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో రైళ్లు క్రిక్కిరిసిపోతున్నాయి. ఐటీ కారిడార్, ఎల్‌బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు కొత్త కోచ్‌లను తీసుకురావాలని నిర్ణయించారు.ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో 57 రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి రైలులో మూడు కోచ్‌లు ఉన్నాయి.

రోజుకు సుమారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కొన్ని రోజులు ఐదు లక్షలు దాటిన సందర్భాలూ ఉన్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు 60 అదనపు స్టాండర్డ్ గేజ్ కోచ్‌లను సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 60 కోచ్‌లతో 10 కొత్త రైళ్లను నడపవచ్చు. ప్రతి రైలు ఆరు కోచ్‌లతో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఎక్కువ సీట్లు అందుబాటులోకి వస్తాయి. నిలబడి ప్రయాణించాల్సిన ఇబ్బంది కొంతమేర తగ్గుతుంది.

Hyderabad Metro to Get 60 New Coaches Capacity Boost Amid Rising Ridership and Phase-2 Plans

ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిజైన్, తయారీ, సరఫరా, టెస్టింగ్, కమిషనింగ్‌తో పాటు 15 ఏళ్ల నిర్వహణ కూడా ఈ ఒప్పందంలో ఉంది. అంచనా వ్యయం రూ.923.62 కోట్లు. ఆసక్తి ఉన్న కంపెనీలు 2027 జనవరి 13 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. సాంకేతిక బిడ్లు జనవరి 14న తెరవనున్నారు. అనంతరం కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు.

ఒప్పందం ప్రకారం డిజైన్ నుంచి కమిషనింగ్ వరకు 125 వారాలు పట్టే అవకాశం ఉంది.ఈ కొత్త కోచ్‌లు ప్రస్తుత ఫేజ్-1 నెట్‌వర్క్‌కు అదనపు సామర్థ్యం కల్పిస్తాయి. అదే సమయంలో మెట్రో విస్తరణ వైపు కూడా హైదరాబాద్ మెట్రో అడుగులు వేస్తోంది. ఫేజ్-2లో ఏడు కారిడార్లలో సుమారు 122.9 కిలోమీటర్ల పొడవున కొత్త లైన్లు ప్రతిపాదించారు. అంచనా వ్యయం రూ.38,595 కోట్లు.

నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గ్ నుంచి కోకాపేట్, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్‌గుట్ట ఓల్డ్ సిటీ, మియాపూర్ నుంచి పటాన్‌చెరు, ఎల్‌బీ నగర్ నుంచి హయత్‌నగర్ వంటి మార్గాలు ఉన్నాయి. వీటితో పాటు విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ, జేబీఎస్ నుంచి మెడ్చల్, షామీర్‌పేట వంటి అదనపు కారిడార్లు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ విస్తరణ జరిగితే హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్ బాగా పెరుగుతుంది.

హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌ రెండో విడత లాటరీ.. ఎప్పుడో తెలుసా!
హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌ రెండో విడత లాటరీ.. ఎప్పుడో తెలుసా!

మరోవైపు. కొత్త కోచ్‌లు వచ్చాక ప్రయాణికులకు మరింత సౌకర్యం అందుతుంది. పీక్ అవర్స్‌లో రద్దీ తగ్గుతుంది. రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచే అవకాశం కూడా ఉంటుంది. మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రస్తుత రద్దీ దృష్ట్యా అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+