హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్.. అధునాతన హంగులు.. అదిరిపోయే అప్డేట్!

మెట్రో రైల్ అభివృద్ధికి, మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ నిర్మాణానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మెట్రో రెండవ దశ పనులకు కేంద్రం ఓకే చెప్తే త్వరలోనే మొదలు కానున్నాయి. అయితే ఈ సారి మెట్రో రెండో దశ మరింత అధునాతన హంగులతో ఉండబోతుంది అన్నది మాత్రం తాజాగా కేంద్రానికి పంపిన డీపీఆర్ తో అర్ధం అవుతుంది.

ఆధునిక టెక్నాలజీతో మెట్రో రైలు రెండో ఫేజ్
తొలి దశలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు, రెండవ దశ నిర్మాణానికి ఇటీవల మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపడంతో మెట్రో రైలు రెండవ దశ విస్తరణకు రాష్ట్రం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించిన డిపిఆర్ ను మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఆ డీపీఆర్ లో మెట్రో సేవలకు సంబంధించిన పలు కీలకఅంశాలు రైల్వేలో మరింత ఆధునిక టెక్నాలజీని, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి.

Hyderabad Metro train Project Advanced Features Exciting Update

76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రెండో దశ
మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మించాలని ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో నాగోల్ శంషాబాద్, రాయదుర్గం కోకాపేట్, ఎంజీబీఎస్ చాంద్రాయణ గుట్ట, మియాపూర్ పటాన్ చెరు, ఎల్బీనగర్ హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెట్రో 3 కారిడార్లలో రోజుకు 5 లక్షల మందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది.

సరికొత్త ప్రయాణ అనుభూతిని కల్గించేలా మెట్రో రెండో దశ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు కోసం మొత్తం 24వేల 249కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన డిపిఆర్ లో మెట్రో సెకండ్ ఫేజ్ లో ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని కల్గించేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్ళలో థర్డ్ జనరేషన్ కోచ్ లు వాడుతుండగా, సెకండ్ ఫేజ్ లో ఫోర్త్ జనరేషన్ కోచ్ లు ఉపయోగించాలని నిర్ణయించారు.

పార్కింగ్ ప్రాబ్లమ్స్ కు చెక్
అంతేకాదు ప్రయాణికుల భద్రత కోసం ప్లాట్ ఫాం పైన స్క్రీన్ డోర్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించటం కోసం ఎకరం విస్తీర్ణంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేయటం వంటి వాటిని తాజా డీపీఆర్‌లో ప్రతిపాదించారు. ప్రస్తుతం చాలా మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్యలు ఉన్నాయి. కానీ మెట్రో రెండో దశలో మాత్రం పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

యు గిడ్దర్ విధానంలో ట్రాక్ పనులు
ప్రతీ మెట్రో స్టేషన్ వద్ద ఎకరం స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నారు. అంతేకాదు కమాండ్ కంట్రోల్ నుండి ఈ రైళ్ళు ఆటోమేటిక్ గా నడవనున్నాయి. సెకండ్ ఫేజ్ లో ఖర్చు తగ్గించటం కోసం యు గిడ్దర్ విధానంలో ట్రాక్ పనులు చేపట్టనున్నారు. అయితే మెట్రో మొదటి దశలో దుకాణాలు, వాణిజ్య అవసరాల కోసం రెండు అంతస్తుల్లో మెట్రో స్టేషన్లు నిర్మించారు.అయితే రెండో ఫేజ్ లో మాత్రం ఒక అంతస్తులోనే స్టేషన్ నిర్మించనున్నారు. జంక్షన్ స్టేషన్లు మాత్రమే రెండు అంతస్తుల్లో ఉండనున్నాయని తెలుస్తోంది. మొత్తంగా మెట్రో సెకండ్ ఫేజ్ అత్యాధునిక హంగులతో ఉండబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+