రేప్, హత్య నిందితుడు వీడే: అతి గారాబమే హంతకుడ్ని చేసింది(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అభంశుభం ఎరగని బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుడు చింతగింజ అనిల్‌ను నార్త్ జోన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి తన కార్యాలయంలో సోమవారం ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

కళాసిగూడకు చెందిన దంపతులు జులై 2న మధ్యాహ్నం తమ కుమార్తె(10)తో పాటు మచ్చబొల్లారంలోని కల్లు దుకాణానికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న కృష్ణానగర్‌కాలనీకి చెందిన అనిల్‌(30) వారితో మాట కలిపాడు. దంపతులు కల్లు తాగుతుండగా వారి కుమార్తెకు బోటి ఇప్పిస్తానని ప్రలోభపెట్టి అమ్ముగూడ రైల్వే పట్టాల వద్ద 1 ఈఎంఈ సెంటర్‌ సమీపంలో నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అనంతరం బాలిక కాళ్లు చేతులు కట్టేసి పాశవికంగా అత్యాచారం చేశాడు. చిన్నారి కేకలు వేయడంతో బండరాయితో తలపై మోది చంపి పరారయ్యాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం బొల్లారం రైల్వేస్టేషన్‌లో నిందితుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

కాగా, నిందితుడు అనిల్‌ 2009 నుంచే నేరాలు చేయడం ప్రారంభించాడు. అతనిపై ఇప్పటికే అల్వాల్‌, నర్సాపూర్‌ పోలీస్‌స్టేషన్లలో 19 కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ తెలిపారు. దుర్వ్యసనాలకు అలవాటుపడ్డ నిందితుడు మొదట్లో ఇళ్లలో చోరీలు చేయడం, ద్విచక్ర వాహనాలను తస్కరించడం, బెదిరించి దోపిడీలకు పాల్పడడం చేశాడు.

అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడు. హత్యాయత్నం కేసులో సంవత్సరంపాటు జైలుశిక్ష అనుభవించి జులై ఒకటో తేదీన బెయిల్‌పై విడుదలై మరుసటి రోజే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అతి గారాబమే హంతకుడ్ని చేసింది: నిందితుడి తల్లిదండ్రులు ఆవేదన

చిన్న కొడుకని అతి గారాబంతో అల్లారు ముద్దుగా పెంచితే నేరస్థుడయ్యాడంటూ నిందితుడు అనిల్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బొల్లారం పోలీస్‌స్టేషన్‌ వద్దకు సోమవారం నిందితుడి తల్లిదండ్రులు భూదయ్య దంపతులు వచ్చారు.

కొడుకు నేరాల బాట పట్టాడని తెలిసి తిట్టడంతో నాలుగేళ్లుగా ఇంటికి రావడం మానేశాడన్నారు. మొదటిసారి ఓ నేరంలో జైలుకు వెళితే కోర్టు బెయిల్‌ ఇప్పించామని, తర్వాత బెయిల్‌ ఎవరు ఇప్పిస్తున్నారో తెలియదని చెప్పారు. ఐదుగురు సంతానంలో చిన్నవాడైన అనిల్‌ స్నేహితుల వల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని వాపోయారు.

మీడియా ముందుకు నిందితుడు

మీడియా ముందుకు నిందితుడు

అభంశుభం ఎరగని బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుడు చింతగింజ అనిల్‌ను నార్త్ జోన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి తన కార్యాలయంలో సోమవారం ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

మీడియా ముందుకు నిందితుడు

మీడియా ముందుకు నిందితుడు

కళాసిగూడకు చెందిన దంపతులు జులై 2న మధ్యాహ్నం తమ కుమార్తె(10)తో పాటు మచ్చబొల్లారంలోని కల్లు దుకాణానికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న కృష్ణానగర్‌కాలనీకి చెందిన అనిల్‌(30) వారితో మాట కలిపాడు.

మీడియా ముందుకు నిందితుడు

మీడియా ముందుకు నిందితుడు

దంపతులు కల్లు తాగుతుండగా వారి కుమార్తెకు బోటి ఇప్పిస్తానని ప్రలోభపెట్టి అమ్ముగూడ రైల్వే పట్టాల వద్ద 1 ఈఎంఈ సెంటర్‌ సమీపంలో నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే రేప్ చేసి దారుణంగా చంపేశాడు.

నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి

నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి

చిన్నారిపై అతి కిరాతకంగా హత్యాచారం చేసిన అనిల్‌ను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, కంటోన్మెంట్‌ బోర్డు సభ్యురాలు పి.భాగ్యశ్రీ డిమాండ్‌ చేశారు. వీరి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు డీసీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

చిన్నారుల నిరసన

చిన్నారుల నిరసన

నిందితుణ్ని పోలీసులు వాహనంలో రిమాండుకు తరలిస్తుండగా, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు వాహనాన్ని చుట్టుముట్టారు. నిందితుడిపై పీడీ చట్టం నమోదు చేస్తామని, కఠినమైన శిక్షపడేలా చూస్తామని డీసీపీ హామీ ఇవ్వడంతో పరిస్థితులు సద్దుమణిగాయి.

చిన్నారుల నిరసన

చిన్నారుల నిరసన

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని, నిందితుణ్ని కఠినంగా శిక్షించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని నేరెళ్ల శారద హెచ్చరించారు. ఆందోళనలో మృతురాలి తల్లిదండ్రులు, పలువురు స్థానిక మహిళా నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police arrested Chintaginja Anil, 30, on Monday for allegedly raping and brutally killing a nine-year-old girl.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి