వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద్రాబాద్‌పై ఐసిస్, ఇవే టార్గెట్: నెట్ ద్వారా బాంబు తయారీ నేర్చారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐసిస్ ఉగ్రవాదుల కన్ను హైదరాబాద్ పైన పడింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎన్ఐఏ, పోలీసులు కలిసి పాతబస్తీలో సోదాలు నిర్వహించారు. ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఇద్దరు సోదరులు కూడా ఉన్నాారు. ఇందులో మొహమ్మద్ ఇబ్రహీం యాజ్దనీ. ఇతను ఇంజినీరింగ్ చేశాడు. గతంలో అమెజాన్‌లో పని చేశాడు. ఇతను భారీ ఆయుధాలతో ప్రయోగాలు చేశాడు.

టెక్కీ సాయంతో హైద్రాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ ప్లాన్: ఏం జరిగింది? (పిక్చర్స్)టెక్కీ సాయంతో హైద్రాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ ప్లాన్: ఏం జరిగింది? (పిక్చర్స్)

పోలీసులు అరెస్టు చేసిన వారంతా 24 నుంచి 32 ఏళ్ల వయస్సు వారే. వారిలో... ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఆటో మొబైల్ వర్కర్లు, మెకానికల్, ఎలక్ట్రానికల్ ఇంజినీర్లు, మోటార్ మెకానిక్‌లు ఉన్నారు. వీరు భారీ పేలుడు పదార్థాలు చేయడంలో నిపుణులుగా పోలసులు గుర్తించారు.

నిందితుల నుంచి పోలీసులు హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి వాటిని స్వాధీనం చేస్కున్నారు. 2015లో దాడులకు పాల్పడిన సూసైడ్ బాంబర్లు ట్రయసేనోట్ ట్రైపోరెక్సైజ్‌ను ఉపయోగించారు. దీనిని హైడ్రోజన్ పెరాక్సైడ్‌తోనే తయారు చేస్తారు.

Hyderabad: Nabbed IS men took bomb making lessons online, say cops

ట్రయసేనోట్ టైపోరెక్సైజ్ బాంబులును స్కానర్లు గుర్తించడం కష్టమని అంటున్నారు. ఈ తరహా పేలుడు పదార్థాలతో ఇన్ఆర్బిట్ షాపింగ్ మాల్స్, ఐటీ కంపెనీలను వారు టార్గెట్ చేశారని చెబుతున్నారు.

ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి మాట్లాడుతూ.. యూరియా బాంబులను కూడా తాము కనుకొన్నట్లు చెప్పారు. కానీ, హైడ్రోజన్ బాంబులు దొరకడమే ఆందోళన కలిగించే విషయమని చెబుతున్నారు. వీరు బాంబుల తయారీని ఇంటర్నెట్ ద్వారా ఎలా చేయాలో తెలుసుకున్నారని చెప్పారు. అంతేకాదు, ప్రయోగం కూడా చేశారన్నారు. అయితే, వాటిని భారీ పేలుడు పదార్థాలుగా ఇంకా చేయలేదని చెప్పారు.

హైదరాబాద్‌లో విధ్వంసానికి ఐసిస్ కుట్ర: ప్రధాన సూత్రధారి టెక్కీ

అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమూదీ ఇల్యాస్ ఫహాద్.. ఇతను గ్రాడ్యుయేట్. పంచ్ మొహల్లాలో ఉంటున్నాడు. ఇతను బాంబ్ ఎక్స్‌పర్ట్. ఇతనికి ఆటోమోబైల్ విడిభాగాల విప్పి, అమర్చడం బాగా తెలుసు. బీబీఏ డిగ్రీ కూడా చేశాడు.

ఇక, సోదరులైన ఇలియాస్ యాజ్దానీ (24) గ్రాడ్యుయేట్. తాలాబ్ కట్టాలో ఉంటాడు. అతని సోదరుడు మొహమ్మద్ ఇబ్రహీం యాజ్దానీ (30). ఇతను ఇంజినీర్. చత్తా బజార్లో ఉంటాడు. వీరు స్నేహితులు, ఇతరులతో కలిసి ఓ గ్రూప్ తయారు చేసుకున్నారు. నిత్యం తీవ్రవాద కార్యకలాపాల గురించి మాట్లాడుకునే వారు. ఇలియాస్ యాజ్దానీ అన్వర్ ఉల్ ఉలూమ్ ఇంజినీరింగ్ కలాశాల నుంచి బీటెక్ (ఈఈఈ) పూర్తి చేశాడు.

ఇతను అమెజాన్‌లో మొబైల్ మార్కెటింగ్ శాఖలో పని చేశాడు. ప్రస్తుతం ఇతను ఏ ఉద్యోగం చేయడం లేదు. ఇక, ఇబ్రహీం గతంలో సౌదీ అరేబీయిలో పని చేశాడు. ఆ తర్వాత భారత్ వచ్చాడు.

వీరి సిరియాలో ఉన్న షఫీ అమర్‌తో పాటే కాకుండా ఇతర గల్ఫ్ మధ్యవర్తులతోను టచ్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. తుపాకీ గుళ్లతో వారు ప్రాక్టీస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కంట్రీ మేడ్ పిస్టల్స్‌కు సరైన మందుగుండు సామాగ్రి వారి వద్ద లేదు. దీంతో, దానిని ఎలాగైనా సేకరించాలనుకున్నారు.

హైద్రాబాద్‌లో పేలళ్లకు ఐసిస్ కుట్ర: భారీ స్కెచ్, పోలీసులకే బెదిరింపు?

అరెస్టైన మిగతా వారిలో... అలీ అజార్ బీకామ్ విద్యార్థి. హబీబ్ ఇంటర్నెట్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఇల్యాస్ మీసేవ కేంద్రంలో పని చేస్తున్నాడు. ఇర్ఫాన్ మోటార్ మెకానిక్. రిజ్వాన్ ఏ ఉద్యోగం చేయడం లేదు.

ఫహాద్ అరెస్ట్ పైన ఆశ్చర్యం

ఫహాద్ అరెస్టును చార్మినార్ పరిసరాల్లో ఉండే పంచ్ మొహల్లా ప్రాంతంలోని వారు నమ్మలేకపోతున్నారు. ఇతను ఈ ప్రాంతానికే చెందిన వాడు. స్థానికంగా ఉండే పలువురు గుమికూడి... అతని అరెస్టు గురించి బుధవారం మధ్యాహ్నం చర్చించుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలను వారు నమ్మలేకపోతున్నారు.

ఫహాద్ పని కోసం అబ్రాడ్ వెళ్లాడు. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చి, హైదరాబాదులోనే పని చేస్తున్నాడు. అతను తన భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వీరితో పాటు ఇతని సోదరులు, తల్లి కూడా ఉంటోంది. ఫహాద్ గౌరవనీయమైన కుటుంబం నుంచి వచ్చాడని, ఇలాంటి పని చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

English summary
The National Investigation Agency officials with the help of the Hyderabad police on Wednesday busted an ISIS terror module and took 11 suspects in custody. The group of terror suspects in the Old City, including two brothers, one of whom is Mohammed Ibrahim Yazdani, an engineer who worked with Amazon earlier, had been experimenting with deadly explosive ingredients like Hydrogen Peroxide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X