హైదరాబాద్ పేరు మార్పు - తెర పైకి మరోసారి : ఆరెస్సెస్ సమావేశాల పేరుతో..!!
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ పేరు మార్పు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఇది రాజకీయ ప్రచారాస్త్రంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఇదే అంశం తెర మీదకు వచ్చింది. అప్పుడు బీజేపీ నేతలు తాము ఎన్నికల్లో గెలిచి..మేయర్ పీఠం దక్కించుకుంటే హైదరాబాద్ పేరు మారుస్తామంటూ ప్రకటనలు చేసారు. ఇప్పుడు తిరిగి ఇదే అంశం నేరుగా ప్రస్తావించకపోయినా..ఆరెస్సెస్ సమావేశాల నిర్వహణ సమయంలో చర్చకు కారణమైంది.
యూపీలో పేర్ల మార్పు అంశం ప్రస్తావన
బీజేపీ ప్రభుత్వం యూపీలో అధికారంలోకి వచ్చిన తరువాత అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా... ఫయజాబాద్ ను అయోధ్యగా..మెఘల్ సరాయిని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ నగర్ గా ఆ రాష్ట్ర సీఎం నిర్ణయించారు. ఇక, హైదరాబాద్ కు గతంలో ఉన్న భాగ్యనగరం పేరు తిరిగి పెట్టాలనేది బీజేపీ డిమాండ్ గా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జరిగింది.చేశారు. యూపీ సీఎం యోగి కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఇదే డిమాండ్ ను వినిపించారు. ఇక, ఇప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) హైదరాబాద్ లో మూడు రోజుల పాటు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం
దీంతో.. ఈ సమావేశం గురించి వివరిస్తూ చేసిన ట్వీట్ లో ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తల సమన్వయ్ బైఠక్ 2022 జనవరి 5 నుండి 7వ తేదీ వరకు తెలంగాణలోని భాగ్యనగర్‌లో జరగుతుందని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు సందర్బాల్లో భాగ్యనగరం... భాగ్మలక్ష్మీ అమ్మవారి దేవాలయం అంటూ ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ..ఈ అంశాన్ని సైతం తమ ప్రచారాస్త్రం గా మలచుకొనే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video

ఇప్పడు తాజాగా మరోసారి చర్చ..
అందులో భాగంగానే ఈ ప్రచారం ప్రారంభించారనే వాదన వినిపిస్తోంది. అయితే, ఇప్పటికే హైదరాబాద్ పూర్తిగా రూపురేఖలు మార్చుకుంది. హైదరాబాద్ - సికింద్రాబాద్- సైబరాబాద్ మూడు నగరాలుగా కలిపి హైదరాబాద్ గా ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడకు వచ్చాయి. ఈ సమయంలో పేరు మార్పు అంశం పైన ఎన్నికల సమయంలో జరిగింది. ఇప్పుడు కూడా తిరిగి అదే అంశం పైన చర్చ మొదలు కావటంతో..రానున్న రోజుల్లో ఇది ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications